Manda Krishna On Chandrababu:  ఎస్సీ రిజ‌ర్వేష‌న్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ  సంతోషం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా చేస్తోన్న పోరాటం ఫలించిందని ఉద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు వల్లే నేడు  కల నెరవేరిందన్నారు.  ఎస్సీ వర్గీకరణ చేసింది గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు.   ఇప్పుడు ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  వర్గీకరణ జరుగుతుందన్నారు.  


న్యాయం బతికిందంటే  చంద్రబాబు వల్లే ! 


ఇందుకు సహకరించిన చంద్రబాబుకు మందకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కావని మందకృష్ణ గుర్తు చేసుకున్నారు. న్యాయం బ్రతికి ఉందంటే చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ద్వారానే అని మందకృష్ణ మాదిగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోపాటు ముప్పై ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమానికి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితమని, అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.                            


బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ - ధర్నా వీడియోలపై స్పీకర్ సీరియస్ - తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ


వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీ                   


ఇటీవల ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ కూడా మద్దతు తెలిపారు. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన  బహిరంగసభలో ప్రసంగించారు.  తమకు అండగా నిలబడ్డ ప్రధాని మోడీ, అమిత్ షా, భుజాన వేసుకుని తమవైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలన్నారు.  వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని... ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని.. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ  ప్రభుత్వాలను కోరారు.                                          


గద్దర్ అవార్డ్స్ కావాలా వద్దా? తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తాజాగా ఏమంటోంది?


జనాబా దామాషా  ప్రకారం అందరికీ న్యాయం జరగాలన్న చంద్రబాబు               


ఎస్సీ వర్గీకరణ అంశంపై శ్రీశైలం పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పందించారు. సామాజిక న్యాయమే టీడీపీ సిద్ధాంతమన్నారు. జనాబా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం జరగాల్సి ఉందన్నారు. గతంలోనే వర్గీకరణక సంబంధించి ఏబీసీడీ వర్గాలను తీసుకొచ్చానన్నారు. అందరికీ న్యాయం జరగాలని.. అందరి వాడిగా ఉంటానన్నారు.