ABP  WhatsApp

NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో వెలసిన 'నోటా' ఆలయం!

ABP Desam Updated at: 02 Dec 2022 04:26 PM (IST)
Edited By: Murali Krishna

NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో ఓ వ్యక్తి నోటా ఆలయం ఏర్పాటు చేశాడు.

Representative Image (Image Source: Getty)

NEXT PREV

NOTA Temple Gujarat: గుజరాజ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న పూర్తయింది. ఈ నెల 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి తన షాప్ దగ్గర 'నోటా' టెంపుల్ (NOTA Temple)  ఏర్పాటు చేశాడు. అందులో భరత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఆయన ఎందుకు ఈ గుడి పెట్టాడంటే?


ఇదీ సంగతి


అహ్మదాబాద్‌లోని నరన్‌పురలో ఓ వ్యక్తి తన షాప్ దగ్గర నోటా టెంపుల్ ఏర్పాటు చేశాడు. అందులో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నొక్కే 'నోటా' పేరు పెట్టాడు.


చిరాగ్ మోదీ అనే ఈ వ్యక్తీ 2015లో ఈ భరత మాత విగ్రహం తయారు చేసి పార్లమెంట్ కార్యదర్శిని భవనంలో ప్రతిష్టించాలని అడిగారు. కానీ ఆయన కోరికను తిరస్కరించారు. 2017లో ఇదే విషయంపై  సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ (పీఐఎల్) వెయ్యగా దాన్నీ కోర్టు కొట్టేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ విగ్రహాన్ని తన షాపులో పెట్టుకున్నాడు.



భరత మాత గౌరవార్థం ఈ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్టించాలని కోరాను. స్థలం లేదు అన్న కారణంతో నిరాకరించారు, మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా పిల్ దాఖలు చేసినా దాన్ని తిరస్కరించారు. ఎక్కడ పెట్టాలో తెలియక నా షాప్‌లో పెట్టుకున్నా.                                    -    చిరాగ్ మోదీ


అందుకే


నరన్‌పురలో గత 20 ఏళ్లకు పైగా తాను నడుపుతున్న పిండి దుకాణం దగ్గర ఈ నోటా టెంపుల్ ఆయన ఏర్పాటు చేశారు. ఈ పేరు పెట్టడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



ఇప్పుడున్నా రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేదు. అన్ని ఎన్నికల్లో అదే నేతలు పోటీ చేస్తున్నారు ఈ విషయాన్నే ప్రజలకి తెలియజేయాడనికి ఈ గుడి పెట్టాను. వాళ్ళు కొత్త నాయకులకు అవకాశాలు ఇవ్వాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వెయ్యొద్దు అని చెప్పట్లేదు. వారికి నచ్చిన వారికి వేసుకోవచ్చు. కేవలం తప్పనిసరి అయితే ఎన్నికల సంఘం కల్పించిన నోటా ఆప్షన్ గురించి మాత్రమే చెప్తున్నాను.                       -    చిరాగ్ మోదీ


ఈ టెంపుల్ ఏర్పాటు చేసిన కారణం, ఉద్దేశం చాలా మందికి అర్ధం కాలేదు కాని కొంత మంది అర్థం చేసుకొని ప్రయత్నాన్ని అభినందించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అవసరమైతే తప్ప నోటా వాడొద్దు అని తన ఉద్దేశాన్ని తెలిపారు.


Also Read: ISRO Espionage Case: ఇస్రో నంబి నారాయణ్‌పై కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు

Published at: 02 Dec 2022 04:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.