చిన్న ఐరన్‌ వస్తువు కడుపులో ఉన్నా... భరించలేని నొప్పి వస్తుందని. అలాంటిది మొత్తం ఐరన్‌ సామగ్రిని తన డుపులోకి దాచేసుకున్నాడో వ్యక్తి. అది చూసి డాక్టర్లు కూడా  షాకయ్యారు. ఆపరేషన్‌ చూసి వాటిని బయటకు తీశారు. అయితే.. ఆ వస్తువులు అతని కడుపులోకి ఎలా వెళ్లాయనేది మాత్రం తెలియడంలేదు. ఈ సంఘటన పంజాబ్‌లో  జరిగింది.


పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 40ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు కుటుంబసభ్యులు. కానీ ప్రయోజనం  లేకపోయింది. ఈ మధ్య కడుపునొప్పి మరీ తీవ్రంగా కావడంతో... మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు కుటుంబసభ్యులు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి,  తీవ్రవైన జ్వరం ఉండటంతో అనుమానం వచ్చిన మెడిసిటీ వైద్యులు.. అతనికి ఎక్స్‌రే, స్కానింగ్‌ తీశారు. ఆ రిపోర్లు చూసి డాక్టర్లకే దిమ్మతిరిగిపోయింది. పేషంట్‌ కడుపులో  ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూలు, రాఖీలతో రకరకాల ఐరెన్‌ వస్తువులు ఉన్నట్టు స్కానింగ్‌లో బయటపడింది. దీంతో వెంటనే అతనికి ఆపరేషన్‌ చేశారు. మూడు  గంటలపాటు శ్రమంచి.. అతని కడుపులోని ఇనుము, ప్లాస్టిక్‌ వస్తువులన్నీ బయటకు తీశారు. 


40ఏళ్ల ఆ వ్యక్తి కడుపులో నుంచి తీసిన వస్తువుల్లో ఇయర్‌ ఫోన్లు, నట్లు, సేఫ్టీ పిన్స్‌, బోల్ట్‌లు, వైర్లు, వాషర్లు, తాళం, తాళం చెవి, రాఖీలు, లాకెట్లు, బటన్లు, రేపర్లు,  హెయిర్‌క్లిప్స్‌, జిప్పర్ ట్యాగ్.. లాంటివి ఎన్నో ఉన్నాయి. అవి చూసి పేషంట్‌ కుటుంబ సభ్యులు కూడా షాకయ్యారు. ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు.. అతని కడుపులో తీసేకొద్దీ  వస్తువులు వస్తూనే ఉన్నాయని అంటున్నారు. బయటకు తీసిన వస్తులను చూసి వారు కూడా షాకయ్యారు.


మెడిసిటీ డాక్టర్‌ అజ్మీర్ కల్రా ఆ వ్యక్తికి ఆపరేషన్‌ చేసిన డాక్టర్లలో ఒకరు. తన కెరీర్‌లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేనది.. ఇదే మొదటిసారని అన్నారు డక్టర్‌ అజ్మీర్‌ కల్రా.  పేషంట్‌ రెండేళ్లుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు. అతని కడుపులో నుంచి అన్ని వస్తువులను బయటకు తీసినప్పటికీ... అతని ఆరోగ్య పరిస్థితి  నిలకడగా లేదని చెప్పారు. ఆ వస్తువులు చాలా కాలంగా అతని కడుపులోనే ఉన్నాయి కనుక.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. వాటి వల్ల.. అతను  కోలుకోవడం మాత్రం కొంచెం కష్టమనే చెప్పారు. 


పేషంట్‌ కుటుంబసభ్యులు కూడా... అతని కడుపులో నుంచి బయటకు తీసిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. ఆ వస్తువులు అతని కడుపులోకి ఎలా  వెళ్లాయి.. ఎప్పుడు మింగేశాడన్నది వాళ్లకు కూడా తెలియది చెప్తున్నారు. రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతన్ని.. ఎందరో డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లినా ఎవరూ..  అతని సమస్యను గుర్తించలేకపోయారని చెప్తున్నారు. కొన్ని రోజులుగా కడుపు నొప్పి ఎక్కువ కావడంతో... రాత్రుళ్లు నిద్ర కూడా పట్టకుండా అల్లాడిపోయాడని  కుటుంబసభ్యులు తెలిపారు. అయితే.. పేషంట్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాట్టు మాత్రం చెప్తున్నారు కుటుంబ సస్యులు. మనసిక సరిగాలేని స్థితిలో... అతను  కనిపించిన వస్తువులన్నీ మింగేసి ఉంటాడని భావిస్తున్నారు.