PM Modi: మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో కంగ్రాట్స్ చెప్పారు. రెండు దేశాల మధ్య మైత్రిని బలపరిచేందుకు చొరవ చూపిస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ముయిజూ.
"మూడోసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నా అభినందనలు. ఇరు దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"
- మహమ్మద్ ముయిజూ, మాల్దీవ్స్ అధ్యక్షుడు
మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత ముయిజూ చేసిన వ్యాఖ్యలు భారత్‌కి ఆగ్రహం కలిగించాయి. చాలా మంది భారతీయులు మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దేశ పర్యాటక రంగం చతికిలబడింది. దయచేసి ఇండియన్స్ మా దేశానికి రండి అంటూ ఆహ్వానిస్తోంది మాల్దీవ్స్. ఇలాంటి సమయంలో ముయిజూ ఈ ట్వీట్ చేయడం కీలకంగా మారింది. మాల్దీవ్స్ ప్రెసిడెంట్‌తో పాటు నేపాల్, మారిషస్, భూటాన్ దేశాల అధినేతలూ మోదీకి కంగ్రాట్స్ చెప్పారు. మూడోసారి గెలిచిన మోదీకి అభినందనలు అంటూ మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ పోస్ట్ పెట్టారు.
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ కూడా మోదీకి అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అభినందించారు. భూటాన్ ప్రధాని త్సెరింగ్ తోబ్గే మోదీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ పెట్టారు. వీళ్లందరికీ ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యావాదాలు చెబుతూ ట్వీట్‌లు పెట్టారు.
Also Read: BJP Failure in UP: యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూకుడుకి బ్రేక్‌లు, ఎక్కడ బెడిసి కొట్టింది?