ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండానే వైసీపీ ఊడ్చిపెట్టుకుపోయింది. కూటమి గాలిలో కొట్టుకుపోయింది. ఇందులో కాంగ్రెస్‌తోపాటు ఆ పార్టీతో జత కట్టిన పార్టీల పాత్ర లేకపోలేదు. సుమారు 25కుపైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలను షర్మిల తన ప్రచారంతో దెబ్బతిశారు. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు తక్కువే కావచ్చు కానీ... అవి కచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకు అని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈ విషయంలో వైసీపీ కూడా కాస్త ఆందోళన చెందింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చాలవరకు అదే నిజమైంది. 15 వేల ఓట్లతో సీట్లు కోల్పోయిన స్థానాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఇండి కూటమి, బీఎస్పీతోపాటు నోటా కూడా వైసీపీ ఓటమిని శాసించింది. తక్కువ మార్జిన్‌లో పోయిన చాలా ప్రాంతాల్లో కూడా నోటాకు కాంగ్రెస్‌కు మంచి ఓట్లు వచ్చాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి తప్పలేదు.
వైసీపీ దెబ్బతీసిన షర్మిల, నోటా, బీఎస్పీ,
| నియోజకవర్గం | వైసీపీ ఓటమికి కారణమైన ఓట్లు | కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు వచ్చిన ఓట్లు | నోటాకు వచ్చిన ఓట్లు | |
| 1 | చీపురుపల్లి | -11971 | 4087 | 2855 |
| 2 | చీరాల | - 20984 | 41859 | 1255 |
| 3 | ధర్మవరం | - 3734 | 3758 | 1787 |
| 4 | డోన్ | - 6049 | 3988 | 1362 |
| 5 | గిద్దలూరు | - 973 | 2879 | 2251 |
| 6 | గుంతకల్లు | - 6826 | 5146 | 1743 |
| 7 | కడప | -18860 | 24500 | 1444 |
| 8 | కదిరి | -6265 | 3314 | 2519 |
| 9 | కోడుమూరు | -21583 | 9835 | 2169 |
| 10 | కర్నూలు | -18876 | 9022 | 718 |
| 11 | మడకశిర | -351 | 17380 | 2728 |
| 12 | మదనపల్లి | -5509 | 6051 | 1759 |
| 13 | మంత్రాలయం | -12805 | 4660 | 3674 |
| 14 | సత్యవేడు | -3739 | 5444 | 2764 |
| 15 | శ్రీశైలం | -6385 | 3429 | 1077 |
| 16 | ఆత్మకూరు | -7576 | 2915 | 2347 |
| 17 | నందికొట్కూరు | -9792 | 7949 | 1274 |
| 18 | నంద్యాల | -12333 | 6418 | 1518 |
| 19 | రంపచోడవరం | -9139 | 21265(సీపీఐ) | 7269 |
| 20 | తంబళ్లపల్లి | -10103 | 3444 | 2384 |
| 21 | ఉదయగిరి | -9621 | 2512 | 2072 |
| 22 | పోలవరం | -7935 | 3811 (ఇండిపెండెంట్) 3708 (ఇండిపెండెంట్) 3568 (కాంగ్రెస్) | 5611 |
| 23 | సింగనమల | -8788 | 3896 (బీఎస్పీ) 3469 (కాంగ్రెస్) | 1906 |
| 24 | ఎమ్మిగనూరు | -15837 | 7831 | 2380 |
| 25 | యర్రగొండుపాలెం | -5200 | 2192 | 2231 |
| 26 | పుట్టపర్తి | -8760 | 3811(బీఎస్పీ) 1997 (కాంగ్రెస్)
| 1382 |
వైసీపీని దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ దాదాపు నలభైకు ప్రాంతాల్లో నోటా స్థాయి ఓట్లు కూడా రాబట్టుకోలేదు. ఇంకొన్ని చోట్లో నోటాతోపాటు పోటీ పడింది.
| నియోజకవర్గం | కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు | నోటాకు వచ్చిన ఓట్లు | |
| 1 | అమలాపురం | 1357 | 2133 |
| 2 | అనకాపల్లి | 1895 | 1853 |
| 3 | అనపర్తి | 1300 | 3105 |
| 4 | ఆత్మకూరు | 2915 | 2347 |
| 5 | అవనిగడ్డ | 1068 | 1952 |
| 6 | చింతలపూడి | 4958 | 4121 |
| 7 | చోడవరం | 2527 | 3849 |
| 8 | దర్శి | 1985 | 2107 |
| 9 | దెందులూరు | 1607 | 1920 |
| 10 | ఎచ్చెర్ల | 2452 | 3952 |
| 11 | గజపతి నగరం | 1315 | 3729 |
| 12 | గన్నవరం | 1731 | 1219 |
| 123 | గోపాలపురం | 2387 | 4500 |
| 14 | ఇచ్చాపురం | 792 | 4374 |
| 15 | కనిగిరి | 1838 | 2217 |
| 16 | కొత్తపేట | 1169 | 1575 |
| 17 | కొవ్వూరు | 1897 | 2465 |
| 18 | మాడుగుల | 1784 | 4070 |
| 19 | మండపేట | 1484 | 1568 |
| 20 | నరసన్నపేట | 2225 | 3300 |
| 21 | నర్సీపట్నం | 1244 | 3824 |
| 22 | నెల్లిమర్ల | 1667 | 3305 |
| 23 | నిడదవోలు | 1691 | 2144 |
| 24 | నూజివీడు | 2405 | 2771 |
| 25 | పాలకొల్లు | 2041 | 4260 |
| 26 | పాలకొండ | 2041 | 4260 |
| 27 | పలాస | 1064 | 2762 |
| 28 | పార్వతీపురం | 1640 | 3465 |
| 29 | పాతపట్నం | 3565 | 3604 |
| 30 | పత్తికొండ | 1956 | 2070 |
| 31 | పాయకరావుపేట | 2087 | 4107 |
| 32 | పిఠాపురం | 1231 | 2027 |
| 33 | ప్రత్తిపాడు | 1354 | 2582 |
| 34 | రాజంపేట | సీపీఐ(1009 ) | 1617 |
| 35 | రాజానగరం | 1901 | 2975 |
| 36 | రామచంద్రాపురం | 1173 | 1608 |
| 37 | రాయచోటి | 1435 | 1628 |
| 38 | సాలూరు | 2239 | 5743 |
| 39 | సర్వేపల్లి | 1577 | 2057 |
| 40 | శృంగవరపు కోట | 1918 | 1969 |
| 41 | టెక్కలి | 2684 | 7342 |
| 42 | తెనాలి | 2188 | 1412 |
| 43 | తిరుపతి | 938 | 1281 |
| 44 | తుని | 1923 | 3434 |
| 45 | వేమూరు | 1664 | 1763 |
| 46 | వెంకటగిరి | 1935 | 3037 |
| 47 | యలమంచిలి | 1822 | 2409 |
| 48 | యర్రగొండుపాలెం | 2192 | 2231 |