Mumbai Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాయ్‌గఢ్‌ కోటను భారీ వరదలు ముంచెత్తాయి. కోటను చూడడానికి వెళ్లిన పర్యాటకులు ఈ వరదలో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీ ఈ కోట కేంద్రంగానే అప్పట్లో పరిపాలించారు. మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌. ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ కోటలో ఒక్కసారిదా వరద నీళ్లు వచ్చాయి. మెట్లపై నుంచి కిందకు దిగుతున్న టూరిస్ట్‌లు ఒక్కసారిగా వచ్చిన ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయారు. అక్కడే చిక్కుకుపోయారు. ఎక్కడి వాళ్లక్కడే నిలబడిపోయి ఒకరినొకరు పట్టుకున్నారు. చాలా సేపు అలాగే ఉండిపోయారు. పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి కొందరు ఎలాగోలా నీటి ఉద్ధృతి నుంచి తప్పించుకున్నారు. మిగతా వాళ్లు మాత్రం చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






అప్రమత్తమైన అధికారులు రోప్‌ వే సాయంతో ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టూరిస్ట్‌ల కోసం ఏర్పాటు చేసిన ఈ రోప్‌ వే సర్వీస్‌ని ప్రస్తుతానికి మూసేసి రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు. ఈ ఘటన తరవాత రాయ్‌గఢ్ ఫోర్ట్‌ సందర్శనను నిలిపివేశారు. కొద్ది రోజుల వరకూ ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎక్కడికక్కడ ద్వారాల వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. పోలీసులూ అక్కడ మొహరించారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా నిఘా పెడుతున్నారు. దాదాపు రెండు రోజులుగా మహారాష్ట్రలో ఇదే పరిస్థితి నెలకొంది. ముంబయి కూడా వరద నీటిలో చిక్కుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా 50 విమానాలను రద్దు చేశారు. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటు ముంబయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. 


Also Read: PM Modi Russia Visit: రష్యాకి చేరుకున్న ప్రధాని మోదీ, పుతిన్‌తో కీలక చర్చలు - ఉక్రెయిన్‌పై ప్రకటన చేసే అవకాశం!