Maharashtra News:


మహారాష్ట్రలో ఘటన..


భూకంప ధాటికి టర్కీ, సిరియా వణికిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా భూమి కంపిస్తూనే ఉంది. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కే లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగానే గడుపుతున్నారంతా. ఇండియాలోనూ పలు చోట్ల స్వల్ప భూకంపం నమోదైన నేపథ్యంలో ఇక్కడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో లతూర్ సిటీలో వింత శబ్దాలు వినిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఫలితంగా...అందరూ భూకంపం వస్తుందేమోనని వణికిపోయారు. అదృష్టవశాత్తూ భూకంపం నమోదు కాలేదు. బుధవారం వివేకానంద చౌక్ వద్ద ఉదయం 10.30 - 10.45 మధ్య ఈ శబ్దాలు వినిపించాయి. భూకంపం వస్తుందేమోనని అంతా పరుగులు పెట్టారు. వెంటనే స్థానిక అధికారులను అలెర్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం అప్రమత్తమైంది. అయితే...ఎలాంటి భూకంపం నమోదు కాలేదని వెల్లడించింది. ఇక్కడి ప్రజలు అంతగా భయపడిపోవడానికి ఓ కారణముంది. 1993లో  ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న కిల్లారి గ్రామంలో భారీ భూకంపం వచ్చింది. ఆ ప్రమాదంలో దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన అలాంటి శబ్దాలు వినిపించడం వల్ల భయపడ్డారు. 
 
భారత్ సేఫేనా..? 


ఈ క్రమంలోనే భూకంపాల విషయంలో భారత్ ఎంత వరకూ సేఫ్ అనే డిబేట్ మొదలైంది. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే..భారత్‌లో 59% మేర భూమి కంపించే ప్రమాదం ఉందని తేలింది. 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలూ "రిస్క్ జోన్‌"లో ఉన్నట్టు వెల్లడైంది. వీటిని ప్రభుత్వం హై రిస్క్ కింద "Zone-5"లో చేర్చింది. ఢిల్లీలోని NCR ప్రాంతం Zone-4లో ఉంది. 2021లో లోక్‌సభలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. 59% మేర భూమి ప్రమాదకర స్థితిలో ఉందని వివరించారు. సెసిమిక్ జోన్ ఆధారంగా, తీవ్రతను బట్టి జోన్‌లుగా విభజించినట్టు చెప్పారు. Zone-5 "అత్యంత ప్రమాదకర స్థితి"గా పరిగణిస్తారు. అంటే...ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది. Zone-2లో ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే...భారత్‌లోని 11% మేర నేల Zone-5లోనే ఉంది. 18% Zone-4, Zone 3 లో 30% అవకాశాలున్నట్టు కేంద్రం వివరించింది. 


హై రిస్క్‌లో హిమాలయా ప్రాంతం..


అత్యంత ఎక్కువగా రిస్క్ ఉంది హిమాలయా ప్రాంతంలోనే. 1905లో కంగ్రా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరవాత 1934లో బిహార్-నేపాల్‌లోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.2గా నమోదైంది. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశీలో సంభవించిన భూకంపానికి 800 మంది చనిపోయారు. ఆ తరవాత 2005లో కశ్మీర్‌లో భూకంపం రాగా...ఈ ప్రమాదంలో 80 వేల మంది మృతి చెందారు. కేంద్రం వివరించిన సెసిమిక్‌ జోన్స్‌లో సోహ్‌నా, మధుర, ఢిల్లీ, మొరాదాబాద్ ప్రాంతాలున్నాయి. గుర్‌గామ్‌ మరీ ప్రమాదకర స్థితిలో ఉందని హెచ్చరించింది. 


Also Read: Cheetahs in India: సౌతాఫ్రికా నుంచి భారత్‌కు మరో 12 చీతాలు, ఇకపై ఏటా దిగుమతి