మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ప్రమాదం జరిగింది. వార్దా నదిలో పడవ బోల్తా పడి 11 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు సహాయక సిబ్బంది తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.






గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అమరావతి ఎస్పీ హరి బాలాజీ తెలిపారు. అధిక బరువు కారణంగానే పడవ మునిగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 


Also Read: Terrorists Arrested: ఉగ్రమూకల కుట్ర భగ్నం .. దిల్లీలో ఆరుగురు ముష్కరులు అరెస్ట్


గాడేగావ్​ గ్రామానికి చెందిన 12 మంది సమీపంలో జలపాతాలు, ఆలయాన్ని సందర్శించేందుకు పడవ ఎక్కారు. జలపాతాలు సందర్శన తర్వాత  ఉదయం 10.30 గంటలకు బోటు బోల్తా పడింది.


ఇద్దరు వ్యక్తులు క్షేమంగా ఒడ్డుకు చేరగా మిగతా వారు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది.. బోటు సిబ్బంది నారాయణ్​ మతారే (45) సహా ఓ మైనర్​ మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో గల్లంతైన మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు విస్తృతం చేశారు.  బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.


Also Read: Quad Summit: 6 నెలల తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన.. బైడెన్‌తో భేటీలో ఈ అంశాలపైనే చర్చ!