దిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు ఉన్నారని దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వెల్లడించింది.
వీరితో పాటు పెలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు వీరు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాం. ఇందులో ఇద్దరు పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకున్నారు. దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో పేలుళ్లకు వీళ్లు పథకం పన్నారు. సమాచారం వచ్చిన వెంటనే మా ప్రత్యేక బృందాలు వాళ్లను పట్టుకున్నాయి. మంగళవారం ఉదయం.. పలు రాష్ట్రాల్లో తనిఖీలు చేశాం. కోటాలో ఒకరిని, దిల్లీలో ఇద్దర్ని, ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశాం. ఇందులో ఇద్దరు పాకిస్థాన్‌కు వెళ్లి పేలుడు పదార్థాలు, ఏకే-47పై వినియోగంపై శిక్షణ తీసుకున్నారు. 15 రోజుల పాటు వీళ్లు శిక్షణ తీసుకున్నారు. - నీరజ్ ఠాకూర్, ప్రత్యేక సీపీ
వీరి గ్రూపులో మరో 14-15 మంది ఉన్నట్లు సమాచారముందని సీపీ అన్నారు. వీరందరినీ త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.