Maharashtra election campaign Telugu Leaders: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇరవయ్యో తేదీన పోలింగ్ ముగిసింది. రెండు కూటముల మధ్య  హోరాహోరీ పోరు సాగుతున్న మహారాష్ట్రలో ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల ప్రచారం హైలెట్ గా నిలిచింది. అలాగే ఏపీ బీజేపీ నేతలు పలువురు మహారాష్ట్రలో పలు ప్రాంతాలకు ఎన్నికల ఇంచార్జులుగా వ్యవహరించారు.వారు కూడా శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాలు తాము చేశారు. 



Also Read:  అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !


మహారాష్ట్ర అంటే మరాఠీగడ్డ. కానీ అక్కడ తెలుగు మూలాలున్న ప్రజలు కోటి మందికిపైగా ఉంటారని అంచనా. షోలాపూర్ లాంటి చోట్ల తెలుగు కుటుంబానికి చెందిన కమ్యూనిస్టు నేత నర్సయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.  ముంబై, పుణె వంటి చోట్ల పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఈ సారి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. 






టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ముంబైలో రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఆయన సోదరుడు చనిపోవడంతో క్యాన్సిల్ అయింది. మరో వైపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ యువనేతలు కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పీవీఎన్ మాధవ్  రెండు ప్రాంతాలకు ఇంచార్జులుగా వ్యవహరించారు. మరో నేత మధుకర్ కూడ మరఠ్వాడా ప్రాంతానికి ఇంచార్జుగా ఉన్నారు. వీరంతా నెల రోజులకుపైగా మహారాష్ట్రలోనే ఉండి ఎన్నికల ప్రణాళికలను రెడీ చేసుకున్నారు. ఎలక్షనీరింగ్ ఏర్పాట్లను కూడా చేసి..ప్రచార గడువు ముగిసిన తర్వాత సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. 


Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్


మహారాష్ట్రలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని అక్కడ ఎన్నికల ఇంచార్జులుగా పని చేసి నేతలు చెబుతున్నారు.ఏక్ నాథ్ షిండే పనితీరు అక్కడి ప్రజల్ని మెప్పించిందని మరోసారి కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తెలుగు మూలాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంకా ఎక్కువ మెజార్టీలు కూటమి అభ్యర్థులకు వస్తాయంటున్నారు.