Watch: సాధారణంగా ఎవరినైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను వినియోగిస్తారు. మరింత అర్జెంట్ అయితే ఏదైనా వాహనంలో తరలిస్తారు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని జేసీబీలో తరలించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది






మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖిటౌలీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సుకు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో జనపద్ పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ వెంటనే స్పందించి తన జేసీబీలోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వ్యక్తికి వెంటనే చికిత్స అందించగలిగారు వైద్యులు.


వైరల్


క్షతగాత్రుడిని జేసీబీలో ఆసుపత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. వెంటనే స్పందించి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన జేసీబీ యజమానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.


మరో ఘటన






మధ్యప్రదేశ్‌లోనే ఇటీవల నీమాచ్‌ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. కానీ, వరదల ఉద్ధృతి కారణంగా అంబులెన్స్‌ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు. దీంతో అక్కడున్న స్థానికులు, అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు ఆ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఓ జేసీబీని ఏర్పాటు చేసి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరైన సమయానికి స్పందించిన అధికారులు, ఎమ్మెల్యేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Also Read: Jammu Kashmir Bus Accident: లోయలో పడిన మినీ బస్సు- 11 మంది మృతి!


Also Read: SCO Summit 2022: రెండేళ్ల తరవాత ప్రధాని మోదీ, పుతిన్ భేటీ, ఆ ఒప్పందం కుదురుతుందా?