ABP  WhatsApp

Madhya Pradesh News: దారుణ ఘటన- బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్ రేప్!

ABP Desam Updated at: 03 Aug 2022 05:22 PM (IST)
Edited By: Murali Krishna

Madhya Pradesh News: బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిని మరోసారి రేప్ చేశాడు ఓ దుర్మార్గుడు.

దారుణ ఘటన- బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్ రేప్!

NEXT PREV

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఓ కీచకుడు బెయిల్‌పై బయటకు వచ్చి బాధిత యువతిపై మరోసారి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.


ఇదీ జరిగింది


మధ్యప్రదేశ్‌ జబల్‌పుర్‌ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ సారి స్నేహితుడితో కలిసి గ్యాంగ్‌ రేప్ చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆ ఘటనన వీడియో తీసి బాధితురాలిని బెదిరించారు.


తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో సదలు వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.


అప్పుడు మైనర్


బాధితురాలికి 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెను వివేక్ పటేల్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇది రుజువు కావడంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఏడాది తర్వాత అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బాధితురాలిపై పగ పెంచుకుని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పథకం ప్రకారం కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.



నాకు ప్రాణ భయం ఉంది. పోలీసులు నాకు భద్రత కల్పించాలని కోరుతున్నాను. అత్యాచారం చేసిన వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతూ మరోసారి ఇలాంటి ఘటనలకే పాల్పడుతుంటే మహిళలకు ఇక రక్షణ ఎలా? పోలీసులు ఇప్పటికైనా నాకు రక్షణ కల్పిస్తారా?                                                    - బాధితురాలు


మరో ఘటన


త‌మిళ‌నాడు రాష్ట్రంలో మంగ‌ళ‌వారం రాత్రి మరో ఘటన జరిగింది. మైలాడుతురైలోని మ‌హిళ నివాసం ముందు ఉన్న గేటును ప‌గుల‌గొట్టి 15 మంది యువ‌కులు ఇంట్లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌ను క‌త్తుల‌తో బెదిరించి మహిళను ఎత్తుకెళ్లారు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. 


సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాప‌ర్ల కారును అడ్డ‌గించి మ‌హిళ‌ను ర‌క్షించారు.


Also Read: Woman Kidnapped In TN: సినిమా కాదు బ్రో- గేటు పగలగొట్టి మహిళను కిడ్నాప్ చేసిన 15 మంది, షాకింగ్ వీడియో!


Also Read: China Taiwan News: అమెరికా యాక్షన్‌కు చైనా రియాక్షన్- తైవాన్‌పై ఆంక్షల కొరడా

Published at: 03 Aug 2022 05:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.