నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వ‌శిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఈ సినిమా ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇదొక భారీ బడ్జెట్ సినిమా. ప్రచార చిత్రాలతోనే సినిమాపై బజ్ పెరిగింది. గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉంది. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే వెంటనే మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని అన్నారు. తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. దాన్ని బట్టి ఆలోచిస్తామని అన్నారు. 


సినిమా హిట్ అయితే రెండు వారాల్లోనే మిగతా భాషల్లో రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడు వశిష్ట మాత్రం తమ దగ్గర అంత సమయం లేదని.. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ తిరగాల్సి ఉంటుందని అన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదట. తెలుగు వెర్షన్ నే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో నార్త్ లో రిలీజ్ చేస్తారని టాక్. UFO మూవీస్ సంస్థ ఈ సినిమాను నార్త్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. 


ఇక ఈ సినిమాలో కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీన‌న్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. 


Also Read: తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్


Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'