Konaseema District Name: కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్నాళ్ల పాటు జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన గొడవలు, ఆందోళనలకు నోటిఫికేషన్ తో తెర దించింది. నేటి వరకూ కోనసీమ పేరుతో జిల్లాగా కొనసాగిన ఈ ప్రాంతం ఇప్పటి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమగా కొనసాగనుంది.
ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. వీరి విజ్ఞాపనకు స్పందించిన ప్రభుత్వం జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు.
ఆందోళనలు, పోలీసుల లాఠీ ఛార్జ్..
అయితే కోనసీమ పేరును అలాగే ఉంచాలని.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరుగా మార్చొద్దంటూ మరికొంత మంది ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా కోనసీమ ముద్దు-వేరే పేరు వద్దు అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేలాది మంది ఆందోళన కారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉరుకులు, పరుగులు తీశారు. దీనికోసం పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాది మంది చేరుకొని నిరసనలు చేపట్టారు. సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలను కూడా ఆందోళన కారులు లెక్కచేయలేరు. బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసన కారులకు కూడా గాయలయ్యాయి.
Also Read: MLA Jyothula: ‘ఇప్పుడు ఈ పార్టీలో ఉంటా, రేపు ఇంకోపార్టీలోకి పోతా’ YSRCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18వ తేదీన ప్రాథమిక గెజిట్ నోటిపికేషన్..
కోనసీమ జిల్లా పేరును డాక్టర్. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 18వ తేదీన ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల రోజల సమయం ఇచ్చింది. ఆ ప్రతిపాదనకు జూన్ 24వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. కోనసీమ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. అన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని స్పష్టతకు వచ్చారు. ఆ తర్వాత 40 రోజులకు ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడదల చేయడం గమనార్హం. సాధారణంగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత వారంలోపే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కానీ దానికి భిన్నంగా ఇంత అసాధారణమైన జాప్యం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Also Read: Nara Lokesh On Visakha Gas Leak: సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేష్ ఫైర్