Lookback 2024 important developments will take place in national politics In 2025: దేశ రాజకీయాలలో 2024 ఓ ప్రత్యేకమైన ఏడాదిగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూటమి వరుసగా మూడో సారి విజయం సాధించింది. ఈ విజయం రాబోయే ఏడాదిలోఅనేక మార్పులు తీసుకు రాబోతోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నారు. అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ దగ్గర నుంచి వక్ఫ్ బిల్లు వరకు ఎన్నో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీతో లేదు అన్న భావనలేదు. తాను చేయాలనుకున్నది చేస్తోంది.అందులో కీలకమైనది జమిలీ బిల్లు. అది వచ్చే ఏడాది పాస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 


రాజ్యాంగ సవరణలు ఎలా దాటాలో బీజేపీకి తెలుసు ! 


భారతీయ జనతా పార్టీకి ఉన్న సామర్థ్యం మేరకు చూస్తే తల్చుకుంటే రాజ్యాంగసవరణల్ని కూడా సులువుగానే పూర్తి చేయవచ్చు. అధికారికంగా ఉన్న బలం ఎంత అన్నది సమస్య కాదు. జమిలీ ఎన్నికలకు ఓటింగే అవసరం అయితే ఆ సమయానికి బీజేపీ విధానాలకు మెచ్చి వచ్చే వారు ఎందరో ఉంటారు. మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తుంది. అందుకే జమిలీ ఎన్నికలు ఖాయమని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇల్లు అలకగానే పండగ కాదు. ఆ తర్వాతే అసలు రాజకీయం ఉంటుంది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదాని తగ్గర నుంచి అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవాలి. ముందుగా కేంద్రం ప్రభుత్వం కూడా ఎన్నికలకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే నాలుగేళ్ల కు పనులు అన్నీ ఓ కొలిక్కి వస్తాయని అనుకోవచ్చు. జమిలీ వచ్చినా 2029లోనే వస్తాయని చంద్రబాబు తేల్చేశారు. నిజానికి ఏపీలో జరుగుతోంది జమిలీ ఎన్నికలే కాబట్టి  పెద్దగా మార్పు ఉండదు. 


సవాళ్లు తెలిసేది కూడా వచ్చే ఏడాదే !


ఓ సారి ఎన్నికలు పూర్తయిన తర్వాతే అసలు సవాళ్లు తెర ముందుకు వస్తాయి. ఆలోచన బాగుటుంది కానీ.. ఆచరణలో ఉండే సమస్యలు బయటకు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం కష్టం. చిన్న రాష్ట్రాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో కొన్ని ఏకపక్ష తీర్పులు  ప్రజలు ఇచ్చారు కానీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రభుత్వాల మనుగడపైనే ఎక్కువగా వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానం సక్సెస్ అవుతుందా లేదా  అన్నది ఆధారపడి ఉంటుంది. దేశంలో జమిలీ ఎన్నికలు అసాధ్యమని వాదించేవారు మెజార్టీ ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఉన్న సమస్యలే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలే జరిగేేవి. కానీ ప్రభుత్వాలు మధ్యలో కూలిపోవడం.. రాజకీయ కారణాలతో ముందుగానే ఎన్నికలకు వెళ్లడం వంటి రాజకీయాలతో రాష్ట్రాలకు రాష్ట్రాలకు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితి వెళ్లిపోయాయి. ఫలితంగా మొత్తం వ్యవస్థ కలగాపులగంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని సరి చేయాలంటే పద్దెనిమిది రాజ్యాంగసవరణలు చేయాల్సి ఉంటుంది. 


కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల భవితవ్యమూ తేలేది వచ్చే ఏడాదే ! 


అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంట్ కు ఎన్నికలకు ఒకే సారి నిర్వహించాలంటే.. ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిమితిని తగ్గించాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిమితి పెంచాలి. కానీ పెంచడానికి అనుమతి లభిస్తుంది కానీ తగ్గించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఐదేళ్లకు  ప్రజలు ఎన్నికలు. తర్వాత మార్చే రాజ్యాంగ సవరణ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు చెల్లుబాటు కాదు. అలాగే జమిలీ ఎన్నికలు ఒక్కసారే నిర్వహిస్తే మధ్యలో ప్రభుత్వం పడిపోతే పరిస్థితి ఏంటి ?. రాష్ట్ర ప్రభుత్వాలు కాదు అసలు కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు ?. మళ్లీఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన కాలానికే నిర్వహించేలా పెడితే అసలు లక్ష్యం దెబ్బతిన్నట్లే కదా. ఇలా ఆలోచిస్తూ పోతూంటే వచ్చే సమస్యలు  వెయ్యి పేజీలకుపైగా ఉన్నాయని రామ్ నాథ్ కోవింద్ కమిటీ తేల్చింది. వాటన్నింటికీ పరిష్కారాలు వెదుకూతూ పోతే పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరం అయ్యాయని తేల్చారు. ఇప్పుడు పార్లమెంట్ లో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆ రాజ్యాంగ సవరణల్ని మార్చాల్సి ఉంది వీటన్నింటిపై వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.