Election Ink History: మనం ఓటు వేసినప్పుడు (Lok Sabha Election 2024) వేలిపై ఇంక్‌ పూస్తారు పోలింగ్ బూత్ అధికారులు. ఓటు వేసినట్టు అదో గుర్తు. ఒకే వ్యక్తి మళ్లీ వచ్చి ఓటు వేయకుండా ఇలా ఇంక్ వేస్తారు. ఎన్నికల ప్రక్రియలో (Voting Ink History) ఇదే కీలకం. ఓటర్లు ఓటు వేసిన తరవాత ఈ ఇంక్‌నే చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. అయితే..ఈ ఇంక్‌కి పెద్ద చరిత్రే ఉంది. బ్లూ కలర్‌లో ఉండే ఈ ఇంక్‌ని సిల్వర్ నైట్రేట్‌తో పాటు కొన్ని రంగులు, సాల్వెంట్స్ కలిపి తయారు (Election Ink) చేస్తారు. ఇది గోరుపైన కానీ, చర్మంపైన కానీ వేసి ఓ 40 సెకన్ల పాటు వదిలేస్తే చాలా రోజుల పాటు చెరిగిపోకుండా ముద్ర పడిపోతుంది. దీన్ని తయారు చేయడానికి ఓ ఫార్ములా ఉంటుంది. ప్రస్తుతానికి ఢిల్లీలోని National Physical Laboratory (NPL) సైంటిస్ట్‌ల అధీనంలో ఉంది ఈ ఫార్ములా. ఇప్పటి వరకూ ఎవరూ దీనిపై పేటెంట్ తీసుకోలేదు. అంతే కాదు. అసలు ఈ ఫార్ములా ఏంటన్నది ఇప్పటికీ ఓ రహస్యమే. 1962 నుంచి ఈ ఇంక్‌ వాడకం ఉన్నా ఇప్పటికీ అది సీక్రెట్‌గానే ఉండిపోయింది. 1962లో పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన సమయంలో ఈ ఇంక్‌ని (Indelible Ink) వినియోగించారు. డబుల్ ఓటింగ్‌ని అడ్డుకునేందుకు ఈ ఆలోచన చేశారు అప్పటి ఎన్నికల అధికారులు. 



భారత్‌కి స్వతంత్య్రం వచ్చిన సమయంలోనే ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో ఈ ఇంక్‌ని తొలిసారి తయారు చేశారు. అయితే...ఈ తయారీకి సంబంధించిన వివరాలేవీ పూర్తిగా లేవు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం...Council of Scientific and Industrial Research కి చెందిన ఓ కెమిస్ట్ తయారు చేశాడు. ఆ తరవాత ఆయన పాకిస్థాన్‌కి వలస వెళ్లిపోయాడు. అప్పట్లో ఆయనతో పాటు పని చేసిన ఉద్యోగులంతా తరవాత ఈ ఇంక్‌ తయారీని కొనసాగించారు. నీళ్లు, డిటర్జెంట్‌లు, సబ్బు నీళ్లు ఇలా వేటితో కడిగినా ఆ మరక తొందరగా చెరిగిపోదు. అదే ఇందులోని స్పెషాల్టీ. మొదట్లో ఈ ఇంక్‌ని తయారు చేసిన NPL ఆ తరవాత మైసూర్‌ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీకి (MVPL) ఆ లైసెన్స్‌ని బదిలీ చేసింది. అప్పటి నుంచి ఈ సంస్థే ఇంక్‌ తయారు చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఈ సంస్థ రూ.58 కోట్ల విలువైన ఇంక్‌ని తయారు చేసింది. వాటిని 28 లక్షల బాటిల్స్‌లో నింపి ఎన్నికల సంఘానికి అందించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 26 వేల లీటర్ల ఇంక్‌ని తయారు చేసింది ఈ సంస్థ. కొన్ని వారాల పాటు ఈ ఇంక్ మరక వేలిపైనే ఉండిపోయినప్పటికీ అది చర్మానికి ఎలాంటి హానీ చేయదు. ఈ ఇంక్‌లోని సిల్వర్ నైట్రేట్ మన శరీరంపైన ఉండే కెమికల్స్‌తో కలిసి కెమికల్ రియాక్షన్‌కి గురవుతుంది. అదే కొద్ది వారాల పాటు మరకగా ఉండిపోయేలా చేస్తుంది. ఇందులో దాదాపు 10-18% వరకూ సిల్వర్ నైట్రేట్‌ని కలుపుతారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు ఈ ఇంక్‌ని సప్లై చేస్తుంది. వీటిలో కెనడా, నేపాల్, మడగాస్కర్, కంబోడియా, సౌతాఫ్రికా, నైజీరియా తదితర దేశాలున్నాయి. 


Also Read: బ్యాంక్ లోన్ కోసం డెడ్‌బాడీతో సంతకం, మహిళ హై డ్రామా - చివరికి అరెస్ట్