Karthika Deepam Fame Nirupam Parital Buy New House: 'కార్తీక దీపం' ఫేం (Karthika Deepam Serial) నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిరుపం కంటే కూడా కార్తీక్, డాక్టర్ బాబుగానే (Karthika Deepam Doctor Babu) ఆడియన్స్‌కి బాగా సుపరిచితం. ఆయన భార్య మంజుల నిరుపం కూడా అందరికి సుపరచితమే. ఇద్దరు కలిసి సీరియల్స్‌లో నటిస్తూ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ తరచూ వీడియోలు షేర్ చేస్తూ పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ డాక్టర్ బాబు ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. శ్రీరామ నవవి (Sri Rama Navami) సందర్బంగా తమ డ్రీమ్ హౌజ్ కలను నిజం చేసుకున్నారు. ఈ బుల్లితెర డాక్టర్‌బాబు కొత్త ఇళ్లు కొన్నాడు.
డాక్టర్ బాబు కొత్త ఇంటి గృహ ప్రవేశం
నిన్న శ్రీరామ నవమి సందర్బంగా ఈ నిరుపమ్-మంజులు గృహ ప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిరుపమ్ భార్య మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో నిరుపమ్, మంజులలు (Manjual - Nirupam) వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కలిసి ఇద్దరు నూతన ఇంటి గృహ ప్రవేశం (Nirupam House warming) చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిరుపమ్ దంపతులకు ఇతర టీవీ నటీనటులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం నిరుపమ్ 'కార్తీక దీపం' సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారాడు. ఈ ధారావాహికతో ఎంతోమంది బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇందులో డాక్టర్ బాబుగా విశేష ఆదరణ పొందాడు. ప్రస్తుతం 'కార్తీక దీపం 2' ఇది నవవసంతం (Karthika Deepam Idi Nava Vasantham Season 2) అంటూ మరోసారి బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ కొనసాగుతుంది. ఇక ఇందులో వంటలక్క, కార్తీక్ జంటకు బుల్లితెర ఆడియన్సే కాదు వెండితెర సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిన సంగతి తెలిసిందే. ఇక కార్తీక్ భార్య మంజుల సైతం ఇతర సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తుంది. ఒకప్పుడ లీడ్ రోల్స్ చేసిన ఆమె ఇప్పుడు అత్త, చెల్లి పాత్రలు పోషిస్తుంది. ఇలా ఇద్దరు బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నిరుపమ్, మంజులది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. చందమామ సీరియల్స్‌తో తొలిసారి ఇద్దరు కలిసి లీడ్ రోల్స్‌లో నటించారు. ఇదే సీరియల్స్‌తోనూ ఇద్దరు బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. అదే టైంలో ప్రేమలో పడ్డ నిరుపమ్, మంజుల ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
Also Read: నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు - అందుకే, కలిసి ఉంటున్నాం: నటి స్నేహ