Gold Rate: మిడిల్‌ ఈస్ట్‌లో ఏర్పిడన ఉద్రిక్తతలు మన ఇంట్లో వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లీళ్లు, ఇతర శుభకార్యాలకు సిద్ధమవుతున్న వాళ్లకు ఇదో బ్యాడ్ న్యూస్‌ అని చెప్పవచ్చు. కొన్ని నెలల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం పరుగు ఇప్పట్లో ఆగబోదంటున్నారు నిపుణులు. ఇప్పుడున్న ఔన్స్ రేటుపై మరో 25 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

మిడిల్ ఈస్ట్‌లో ఉన్న పరిస్థితులు, బలహీనమైన మానిటరీ పాలసీ కారణంగా పసుపు లోహం పట్టు చిక్కడం లేదు. ఇప్పుడు అది మరింతగా పెరిగిపోతుందని సిటీ స్ట్రటజీసంస్థ అంచనా వేస్తోంది. గత వారం 2400 డాలర్ల మేర పెరిగిన ఔన్స్ బంగారం ధర 3000 దాటే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. 

ఆరు నుంచి 18 నెలల్లో ఔన్స్ బంగారం ధర 3000డాలర్లకు చేరుతుందని సిటీ స్ట్రాటజీ సంస్థ చీఫ్‌ ఆకాష్ పేర్కొన్నారు. ఈ అంచనాతోనే తాము పెట్టుకున్న లక్ష్యాలను కూడా సవరించుకుందీ సంస్థ. 2024లో చేసిన అంచనాను 2350 డాలర్లకు 2025 నాటి ప్రైస్‌ను 2500కు సవరించుకుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే 2024 ఏడాది చివరి నాటికి ఔన్స్‌ ధర 2500 డాలర్లుకు చేరుకుంటుందని అంటున్నారు. 

ఇప్పుడు పసిడి పరుగుకు ఈ మధ్య అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆజ్యం పోశాయి అంటున్నారు. రికార్డ్ ఈక్విటీ ఇండెక్స్ స్థాయిలతో సమానంగా పెరుగుతోంది. వీటన్నింటి ఫలితంగానే భవిష్యత్‌లో కూడా బంగారం రేట్ రాకెట్‌ మాదిరి దూసుకెళ్తుందని అంటున్నారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో ప్రపంచంలో ఒక్కసారిగా భయం మొదలైంది. నిత్యవసరాల ముఖ్యంగా ఆయిల్ వంటి ధరలపై అనేక అనమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో సురక్షితమైన బంగారం లాంటి ఆస్తుల కొనుగోలు ఎక్కువైంది. అందుకే బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 

అంత కంటే ముందు నుంచే బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. మిడిల్ ఈస్టులో రాజకీయ పరిస్థితులతో ఆ పెరుగుదలో భారీ మార్పు కనిపిస్తోంది. అమెరికా ఫడరల్ బ్యాంక్ వడ్డీ రేట్‌లను తగ్గిస్తుందనే అంచనాలు కూడా బంగారం రేట్ పెరుగుదలకు ఆజ్యం పోశాయి. 

ఇవాళ ఔన్‌ బంగారం ధర 2,379.49 డాలర్లు ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 11.52 డాలర్ల పెరుగుదల కనిపించింది. కానీ ఇండియాలో మాత్రం బంగారం ధర మూడు వందల రూపాయలకుపైగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 67వేల 650 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 73,800 రూపాయలు ఉంది. 

ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ధరలు పరిశీలిస్తే...

ప్రాంతం 24 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారం  
ఆంధ్రప్రదేశ్‌    రూ. 73,800     రూ. 67,650
తెలంగాణ      రూ. 73,800     రూ. 67,650
చెన్నై      రూ.74,560     రూ. 68,350
ముంబై     రూ. 73,800     రూ. 67,650
ఢిల్లీ      రూ. 73,950     రూ. 67,800 
కోల్‌కతా     రూ. 73,800     రూ. 67,650
బెంగళూరు    రూ. 73,800     రూ. 67,650
కేరళ     రూ. 73,800     రూ. 67,650
పూణె    రూ. 73,800     రూ. 67,650