Google Pixel 8a: గూగుల్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి గూగుల్ పిక్సెల్ 8ఏ అని పేరు పెట్టారు. మేలో జరగనున్న గూగుల్ ఐ/వో ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా తెలియలేదు. గూగుల్ దీన్ని అధికారికంగా ప్రకటించలేదు.
కలర్ ఆప్షన్లు లీక్
అయితే ఈ ఫోన్ గురించిన వివిధ నివేదికల ద్వారా దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌లు కొన్ని లీక్ అవుతున్నాయి. ఇటీవలే ఈ రాబోయే గూగుల్ ఫోన్ కలర్ ఆప్షన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
గూగుల్ పిక్సెల్ 8ఏ ఇప్పటివరకు నాలుగు రంగులలో కనిపించింది. వీటిలో పవర్ ఫుల్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్‌ల ద్వారా పోస్ట్ చేయబడిన కొన్ని రెండర్‌లు అధికారిక రెండర్‌లుగా కనిపిస్తాయి. వీటిలో నాలుగు కలర్ వేరియంట్‌లను చూడవచ్చు. ఈ పోస్ట్‌లో పిక్సెల్ 8ఏ అబ్సిడియన్, పోర్స్‌లెయిన్, బే, మింట్ అనే నాలుగు కలర్ వేరియంట్లు కనిపించాయి.
డిజైన్ కూడా రివీల్
పాత పిక్సెల్ ఫోన్‌లతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 8ఏ చుట్టూ సన్నని బెజెల్‌లను కలిగి ఉంటుందని ఈ లీకైన చిత్రాలలో చూడవచ్చు. ఈ ఫోన్ స్క్రీన్‌ని ఆన్ చేసినప్పుడు దాని బెజెల్స్ గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8ఏ ప్రో కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. కానీ గూగుల్ పిక్సెల్ 7ఏ కంటే చిన్నవిగానే ఉన్నాయి. అయితే గూగుల్ పిక్సెల్ 8ఏ సర్క్యులర్ డిజైన్ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుందని ఫొటోల్లో చూడవచ్చు. ఈ సెటప్‌లో ఎన్ని మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయని సమాచారం అందలేదు. ఈ ఫోన్ ముందు భాగంలో సెంటర్డ్ పంచ్ హోల్ డిస్‌ప్లే అందించనున్నారు. ఇది సెల్ఫీ కెమెరాగా పనిచేస్తుంది.
గూగుల్ 2024 ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ను మే 14వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గూగుల్ 2024 ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ ఒక ఇన్ పర్సన్ ఈవెంట్. అంతే కాకుండా గూగుల్ అధికారిక సోషల్ మీడియా ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసే ఆప్షన్ ఉంది. గూగుల్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ ఈవెంట్లో కంపెనీ కొత్త లాంచ్‌లను ప్రదర్శిస్తుంది. 2024 ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గూగుల్ ఏఐ విభాగంలో తను చేసిన లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను కూడా రివీల్ చేయనుందని తెలుస్తోంది. జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫీచర్లను కూడా ఈ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ద్వారా గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ డేట్‌ను రివీల్ చేసింది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది