Liquor Shops Ban : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పవిత్ర పట్టణాల్లో మద్యం దుకాణాలపై నిషేధం ప్రకటించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నిషేధంపై దృష్టి సారించిన సర్కారు.. మొదటి విడతలో 17 ముఖ్య నగరాల్లో నిషేధాజ్ఞలు విధించేలా ఆదేశాలు జారీ చేశామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. వీటిలో  ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు నగర పాలికలు, ఆరు నగర పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించడంలో తొలి అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం మోహన్ యాదవ్ వివరించారు. అయితే ఈ 17 నగరాల్లో ఆయన స్వస్థలమైన ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉండడం గమనార్హం.


ఈ నగరాల్లో మద్యం దుకాణాలపై నిషేదాజ్ఞలు


చిత్రకూట్,  కుందల్‌పూర్, అమర్‌కంటక్, సల్కాన్‌పూర్, బర్మన్ కాలా, లింగ, బండక్‌పూర్, దాతియా, మండలేశ్వర్, పన్నా, మైహర్, ముల్తాయ్, మందసౌర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, బర్మన్ ఖుర్డ్, ఓర్ఛా.


మద్యం దుకాణాల నిషేధంపై సీఎం ఏమన్నారంటే..


మహేశ్వరంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం మోహన్ యాదవ్ మద్యం నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. తాము నిర్ణయించిన, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలనకు ఎక్కడికీ తరలించమని, శాశ్వతంగా మూసివేస్తామని చెప్పారు. మద్యం నిషేధించిన ప్రాంతాలన్నీ మతపరమైన పుణ్యక్షేత్రాలేనని. నర్మదా నది ఒడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలోని లిక్కర్ షాపులనూ బంద్ చేపిస్తామన్నారు. భవిష్యత్తులోనూ ఈ నిర్ణయం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము మధ్యప్రదేశ్ లో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.






సీఎం నిర్ణయంపై హర్షాతిరేకాలు


తాజాగా మోహన్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పుణ్యక్షేత్రాల్లో పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యమని, ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసేయడం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు. ఈ తరహా నిర్ణయాలు భవిష్యత్ తరాలు మద్యానికి బానిస కాకుండా చేస్తాయని అంటున్నారు. యువతను సన్మార్గంలో నడిపేందుకు ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని, ఈ రోజుల్లో మందు తాగడాన్ని ఓ స్టేటల్ గా భావిస్తున్నారంటున్నారు. నిజానికి ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇప్పుడు బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల పుణ్యక్తేత్రాలున్న ప్రాంతాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.






Also Read : Budget Halwa: బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?