Layoffs Across World:


రికార్డు స్థాయిలో లేఆఫ్‌లు..


2023లో అప్పుడే ఆర్నెల్లు గడిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత మాత్రం ఆగడం లేదు. దాదాపు అన్ని బడా కంపెనీలు గతేడాదే లేఆఫ్‌లు మొదలు పెట్టి...ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ ఆర్నెల్లలో ప్రపంచంలో దాదాపు 2.12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంతే కాదు. ఇదే ఆర్నెల్లో గ్లోబల్ టెక్నాలజీ సెక్టార్‌కి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 819 టెక్ కంపెనీలు 212,221 మేర ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే గతేడాది లెక్కలు చూస్తే...1046 కంపెనీలు 1.61 లక్షల మందిని తొలగించాయి. అంటే...ఈ ఏడాది అంత కన్నా ఎక్కువగా..కేవలం ఆర్నెల్లలోనే లేఆఫ్‌లు జరిగాయి. మొత్తంగా ఈ రెండేళ్లలో 3.8 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. స్టార్టప్‌ కంపెనీలైనా...బడా సంస్థలైనా లేఆఫ్‌లకు చెబుతున్న కారణమొక్కటే. కరోనా సమయంలో అవసరానికి మించిన ఉద్యోగులను తీసుకున్నారు. అప్పుడు బిజినెస్ బాగా పెరిగింది. ఆ తరవాత క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. చాలా మందిని ఆర్థికంగా దెబ్బ తీసింది కొవిడ్ సంక్షోభం. కొనుగోలు శక్తి పడిపోయింది. బిజినెస్ డల్ అయింది. అన్ని కంపెనీలపైనా ఈ ప్రభావం పడింది. ఫలితంగా...అనుకున్న స్థాయిలో రెవెన్యూ రావడం లేదు. ఇండియాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇండియన్ టెక్‌ సిస్టమ్‌లోనూ ఒడుదొడుకులు తప్పడం లేదు. ఇప్పటి వరకూ స్టార్టప్‌లలో 11 వేల మంది ఉద్యోగులను తొలగించారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది ఎక్కువే. గతేడాదితో మొదలై ఇప్పటి వరకూ ఇండియాలో 102  స్టార్టప్ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. ఈ కారణంగా 27 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీటిలో కొన్ని యునికార్న్ కంపెనీలు కూడా ఉన్నాయి. వచ్చే ఆర్నెల్లలో ఈ లేఆఫ్‌లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.  


విడతల వారీగా కోతలు..


10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని మార్చిలో ప్రకటించింది మెటా. అప్పటి నుంచి విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తికాగా...ఇప్పుడు మూడో రౌండ్ మొదలు పెట్టింది. ఇదే చివరిది అని వెల్లడించింది. ముఖ్యంగా బిజినెస్ అండ్ ఆపరేషన్స్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటెజీ...ఇలా రకరకాల డిపార్ట్‌మెంట్‌లకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపింది. ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయిస్ లింక్డిన్‌లో వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రైవసీ అండ్ ఇంటెగ్రిటీ విభాగానికి చెందిన ఉద్యోగులకూ లేఆఫ్‌లు తప్పవని తేల్చి చెప్పింది మెటా. లింక్డిన్‌ పోస్ట్‌లు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది కూడా. గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ మెటాదే. 11 వేల మందిని తొలగిస్తామని గతేడాది ప్రకటించింది. ఆ తరవాత ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. లేఆఫ్‌లపై అమెజాన్ సీఈవో యాండీ జాసీ (Andy Jassy) కూడా స్పందించారు. షేర్‌ హోల్టర్‌లందరికీ ఓ లెటర్ రాశారు. కంపెనీ ఛాలెంజింగ్ ఫేజ్‌ను ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుతం కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా తీసుకుంటున్న చర్యలు కంపెనీ గ్రోత్‌కి హెల్ప్ అవుతాయని భావిస్తున్నట్టు లెటర్‌లో రాశారు యాండీ జాసీ. 


Also Read: బీజేపీకి పరీక్ష పెడుతున్న ఈశాన్య రాష్ట్రాలు, యునిఫామ్ సివిల్‌ కోడ్ అమలు అక్కడ కష్టమే!