Sanjay Raut Death Threat:


ఢిల్లీలోనే చంపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్ 


ఉద్ధవ్ థాక్రే శివసేవనకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ తనను చంపేస్తామని బెదిరించినట్టు సంజయ్ రౌత్ పోలీసులకు వెల్లడించారు. ఆయన వాట్సాప్‌ నంబర్‌కు ఆ గ్యాంగ్ నుంచి మెసేజ్ వచ్చింది. AK-47తో ఢిల్లీలోనే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను ఎలా అయితే హత్య చేశామో...అదే విధంగా  చంపేస్తామని హెచ్చరించింది. ఈ బెదిరింపులు వచ్చిన వెంటనే సంజయ్ రౌత్ అలెర్ట్ అయ్యారు. ఆ వివరాలన్నింటినీ ముంబయి పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. విచారణ జరిపించాలని కోరారు.  "నువ్వో హిందూ వ్యతిరేకివి. తప్పకుండా చంపేస్తాం" అని మెసేజ్ పంపించారు.   తనకు ప్రాణహాని ఉందని గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు రౌత్. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఇదే విషయాన్ని అప్పట్లో వివరించారు. ఇప్పుడు నేరుగా ఆయన సెల్‌కే మెసేజ్ రావడం ఆందోళన కలిగించింది. అంతకు ముందు ఇదే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కూ వార్నింగ్ పంపాయి. గతేడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ఆఫీస్‌కు కాల్ చేసి బెదిరించింది బిష్ణోయ్ గ్యాంగ్. జింకను వేటాడినందుకు ఆయనను చంపేస్తామని హెచ్చరించింది. "సారీ చెప్పండి లేదంటే తరవాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అని సల్మాన్ భాయ్‌ను బెదిరించింది. వెంటనే అప్రమత్తమైన సల్మాన్...పోలీసులకు సమాచారం అందించారు.