ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల (Postal Ballot) వివాదం నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో బ్యాలెట్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అర్ధరాత్రి అజ్ఞాతం వీడిన పిన్నెల్లి, నరసరావుపేటలో ప్రత్యక్షం, అదే జరిగితే అరెస్ట్ తప్పదు!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అజ్ఞాతం వీడారు. పలు కేసుల్లో అరెస్ట్ కాకుండా మంగళవారం హైకోర్టు (AP High Court) నుంచి పిన్నెల్లి ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి నరసరావుపేట(Narasaraopeta)లో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకున్నారు. స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇల్లు ఖాళీ చేయకుండా వేధిస్తున్నారు- పోలీసులను ఆశ్రయించిన జేసీ దివాకర్ రెడ్డి
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ఏదో హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఓ ఇంటి వివాదంపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని ఓ ఫ్యామిలీ ఖాళీ చేయకపోగా... తన సంతకాలు ఫోర్జరీ చేసిందని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని  జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబర్‌ 62లో జేసీ దివాకర్ రెడ్డికి ఓ ఇల్లు ఉంది. దీన్ని సాహితీ లక్ష్మీనారాయణ అనే ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు వివాదానికి కేంద్రం బిందువు ఈ ఇల్లే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం - వీటిలో ఏది ఫైనల్ చేస్తారో ?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త అధికారిక చిహ్నాన్ని ఖరారు చేయనుంది.  కొత్త చిహ్నం రూపొందించడంలో రూపకర్త రుద్ర రాజేశం అండ్ కో బిజీగా ఉంది. వారు సిద్ధం చేసిన కొన్ని లోగోలను సీఎం రేవంత్ రెడ్డి పరిశిలించారు.  అందులో ఒకదానిని సెలక్ట్ చేసి కొన్ని మార్పు చేర్పులు సూచించినట్లుగా తెలు్సతోంది.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరారు చేసిన లోగో రాచరిక పోకడలతో ఉందని.. అమరుల త్యాగాలు ఎత్తిపట్టేలా తెలంగాణ చిహ్నం ఉండాలని నిర్ణయించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎవరు గెలిచినా సైలెంట్‌గా ఉండాల్సిందే, జూన్ 3 నుంచి 5 వరకు మద్యం అమ్మకాలు బంద్: ఈసీ
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూము అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అధికారులకు సూచించారు. పల్నాడు జిల్లాలో జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) పర్యవేక్షించారు. జేఎన్టీయూ కాకానిలోని కౌంటింగ్ కేంద్రం, కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేసిన, చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి