Khammam News: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల హడావుడి మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో  అటు కాలేజీలు, ఇటు కొత్త  విద్యార్థుల్లోనూ  ఒక్కటే టెన్షన్‌ నెలకొంది. మంచి కాలేజీ, కోర్సులు ఎంచుకోవాలని విద్యార్థులు....ర్యాంకులు తెచ్చిపెట్టే విద్యార్థుల కోసం కళాశాలల యాజమాన్యం  ఆరాటపడుతున్నారు. ఖమ్మజిల్లా వ్యాప్తంగా  ఉన్న టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు ఏంటో ఒకసారి చూద్దాం....LOOK


ఖమ్మం(Khammam) జిల్లాలో టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు


స్వర్ణభారతి ఇంజినీరింగ్ కాలేజీ
ఖమ్మం నగరంలోనే ఉన్న స్వర్ణభారతి (Swarna Bharathi) ఇంజినీరింగ్ కాలేజీ బీటెక్, భీఫార్మసీ, ఎంటెక్‌ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఈ కాలేజీలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. బీటెక్‌లో మొత్తం పది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, డేటా సైన్స్‌, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌  మెషిన్ లెర్నింగ్, ఈఈఈ కోర్సులు ఈ కాలేజీలో అందుబాటులో ఉన్నాయి


మదర్‌ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ
సత్తుపల్లి(Sathupally)కి సమీపంలోని కొత్తూరులో మదర్ థెరిస్సా(Mother Teresa) ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇక్కడ సీఎస్‌ఈ, మెకానికల్‌, మైనింగ్‌, ఈఈఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, సివిల్, ఈసీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా  ఈ కాలేజీలో సీట్ల కేటాయింపు ఉంటుంది. బీటెక్, ఎంటెక్‌తోపాటు ఎంబీఏ  కోర్సులు  అందుబాటులో ఉన్నాయి.


సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీ
సత్తుపల్లికి సమీపంలోనే గంగారంలో సాయిస్ఫూర్తి(Sai Spurthi) ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇక్కడ సీఎస్‌ఈ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌, ఈసీఈ, మెకానికల్‌, ఈఈఈకోర్సులు  అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ఈ కాలేజీలో సీట్ల కేటాయింపు ఉంటుంది


కె.ఎల్‌.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ(Palwancha)లో K.L.R. ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో  సీఎస్‌ఈ, మైనింగ్, సివిల్,ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాల్వంచ పరిసర ప్రాంత విద్యార్థులకు ఈ కాలేజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


బొమ్మ ఇంజినీరింగ్ కాలేజీ
ఖమ్మం శివారులోని అల్లిపురంలో బొమ్మ ఇంజినీరింగ్ కాలేజీ(Bomma Engineering College) ఉంది. తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ఈకాలేజీలో సీట్లు కేటాయింపు చేస్తారు. ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో ఉండటం విద్యార్థులకు కలిసొచ్చే అంశం. సీఎస్‌ఈ, సివిల్, ఈసీఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ప్రియదర్శిని ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ
ఖమ్మం శివారులోని ప్రియదర్శిని(Priyadarshini) విద్యాసంస్థల ఆవరణలోనే మహిళల కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో బీటెక్‌లో సీఎస్‌ఈ,  ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్‌,ఈసీఈ, ఈఈఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కేవలం మహిళా కాలేజీ కావాలనుకుంటున్న వారికి ఖమ్మంలో ఉన్న ఏకైక ఇంజినీరింగ్ కాలేజీ ఇది.


అనుబోస్‌ ఇంజినీరింగ్ కాలేజీ
పాల్వంచ(Palwancha)లోనే ఉన్న మరో ఇంజినీరింగ్ కాలేజీ అనుబోస్‌(Anu Bose)... ఈ కాలేజీలో సీఎస్‌ఈ, మైనింగ్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఈఈఈ, డేటాసైన్స్‌, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే ఈ కళాశాలలో సీట్లు కేటాయింపు ఉంటుంది.


శ్రీకవిత ఇంజినీరింగ్ కాలేజీ
ఖమ్మం సమీపంలోని కారేపల్లి(Kaarepalli) పట్టణంలో శ్రీకవిత(Sri kavitha) ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇక్కడ బీటెక్‌లో  మైనింగ్, మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, డేటా సైన్స్‌, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు  ఉంటుంది.


ఆడమ్స్ ఇంజినీరింగ్ కాలేజీ
పాల్వంచలోనే  ఉన్న మరో ఇంజినీరింగ్ కాలేజీ ఆడమ్స్(Adam's)... ఇక్కడ సీఎస్‌ఈ, మైనింగ్, సివిల్, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కాలేజీ
ఖమ్మం సమీపంలోని మరో ఇంజినీరింగ్ కాలేజీ దరిపల్లి అనంతరాములు(Anatharamulu) ఇంజినీరింగ్ కాలేజీ...ఈ కళాశాలలో సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, మైనింగ్, మెషిన్ లెర్నింగ్, ఈఈఈ, ఈసీఈ కోర్సులను అందిస్తోంది. మహబూబాబాద్ సమీపంలోని విద్యార్థులకు ఈ కళాశాల  అందుబాటులో ఉంటుంది.