Andhra Pradesh News Today: తెలంగాణలో వేడుకలు, ఏపీలో దశాబ్ద ఘోష - ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
సరిగ్గా ఈరోజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అన్నారు. తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జరుపుకుంటున్నారని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'అధికారం లేకున్నా ప్రజల కోసం పని చేయాలి' - గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసమన్న కేసీఆర్
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhawan) నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని అన్నారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయన.. కొన్ని క్షణాలు బాధగా ఉంటాయని చెప్పారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' విడుదల - రచయిత అందెశ్రీ భావోద్వేగం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ'ను (Jai Jai Hey Telangana) విడుదల చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. 'జయజయహే తెలంగాణ' గీతాన్ని అందెశ్రీ రచించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పోస్టల్ బ్యాలెట్ అంశంపై పిటిషన్ - వైసీపీకి హైకోర్టులో చుక్కెదురు, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన!
పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) చెల్లుబాటుపై సీఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు (AP High Court) తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్ కు అర్హత ఉందన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనతో కోర్టు ఏకీభవించింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


NDA లక్ష్యాన్ని చేరువ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ - కూటమిగా మారడమే అసలైన గేమ్ ఛేంజర్ !
దక్షిణాదిన ఈ సారి మంచి ఫలితాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పలు సందర్భాల్లో పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేశారు. వారు దానికి తగ్గట్లుగా ఎక్సర్‌సైజ్ చేశారని ఏబీపీ-సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టమయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సారి ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు లభించనున్నాయి. 2019లో ఏపీ నుంచి ఎన్డీఏకు ఒక్క సీటు కూడా లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి