Vundavalli aruna kumar Comments: సరిగ్గా ఈరోజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అన్నారు. తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జరుపుకుంటున్నారని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలను పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో 58 శాతం తెలంగాణ నుంచి ఏపీకి రావాలి. ఆ బకాయిలు రావాలి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక్కటే. గత పదేళ్లుగా రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. తెలంగాణ అసెంబ్లీ తరహాలోనూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాలి. పోలవరం ప్రాజెక్టు అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. డిజైన్ తప్పయితే ప్రజలతో అన్ని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాలేదు. ఇక్కడకి ఎవరు రారు. చంద్రబాబుకు సంబంధించిన వ్యాపారాలు హెడ్ క్వాటర్స్, ఇంకా జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యాపారాలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజనపై నేను ఫిబ్రవరిలో ఫైల్ చేశాను. జగన్ దానిపై ఎఫిడవిట్ వేశారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. అఫిడవిట్లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన ఎప్పుడు జరగాలి? ఏం జరగాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పాయింట్ కూడా క్లియర్ గా అడిగాను. అయినా ఏ సమాధానం లేదు’’ అని ఉండవల్లి వ్యాఖ్యలు చేశారు. రానున్న ప్రభుత్వం వల్ల అయినా ఏపీ పరిస్థితి మారాలని ఉండవల్లి అరుణ కుమార్ ఆకాంక్షించారు.