Lata Mangeshkar Birth Anniversary:
అయోధ్యలోని ఆ కూడలికి..
అయోధ్యలోని ఓ కూడలికి గానకోకిల లతా మంగేష్కర్ పేరు పెట్టనున్నారు. అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ చౌరస్తాను ప్రారంభించ నున్నారు. లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా...నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు కానున్నారు. సరయు నదికి సమీపంలో ఉన్న ఈ చౌరస్తాకు "లతా మంగేష్కర్ చౌరాహా" (Lata Mangeshkar Chauraha) అని నామకరణం చేయనున్నారు. దీన్ని రూ. 7.9 కోట్లతో నిర్మించారు. ఈ చౌరస్తాలోనే మరో స్పెషల్ అట్రాక్షన్‌ను జోడించనున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేసిన వీణను ఈ చౌరస్తాలో ఏర్పాటు చేస్తారు. 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తు,14 టన్నుల బరువైన ఈ వీణను రెండు నెలల్లోనూ తయారు చేశారు. సరస్వతీ దేవి బొమ్మనూ ఆ వీణపై చెక్కారు. పర్యాటకులు, సంగీత ప్రియులకు ఈ చౌరస్తా ఆకట్టుకోనుంది. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఓ సంగీత పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయటం ఇదే తొలిసారి. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్...ఈ ప్రాజెక్ట్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అయోధ్యలో చేపట్టిన అతి కీలకమైన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి అని ఆయన వెల్లడించారు. శనివారం ముంబయి వెళ్లిన సత్యేంద్ర సింగ్...లతా మంగేష్కర్ కుటుంబ సభ్యుల్ని కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సీయం యోగి ఆదిత్యనాథ్ ప్రతినిధిగా వెళ్లిన ఆయన...లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించారు.
ప్రధానికి ప్రత్యేక అనుబంధం..
భారతీయ సినీరంగంలో గానకోకిలగా పేరు తెచ్చుకున్న Latha mangeshkar ఇక లేరు. Covid రావటంతో ఈ ఏడాది జనవరిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన లతా మంగేష్కర్ ఆరోగ్యం అప్పటి నుంచి క్షీణిస్తూ వచ్చింది. వెంటిలేటర్ పైనే ఇన్నాళ్లూ చికిత్స తీసుకున్నా...కొద్దిరోజుల క్రితం వెంటిలేటర్ తీసివేయటంతో ఆమె ఆరోగ్యం కుదుట పడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఆరోగ్యం క్షీణించటంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. లతాజీ మరణంతో అప్పట్లో ప్రధాని మోదీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమో పంచుకున్నారు. ‘‘లతా మంగేష్కర్ గారి మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయామూర్తి అయిన లతా అక్క మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి నిదర్శనంగా గుర్తుంచుకుంటాయి. ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర మార్పులను దగ్గరగా చూశారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. ఆమె భారతదేశం ఎదుగుదల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపేవారు. ఆమె ఎల్లప్పుడూ సమర్థమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకున్నారు. లతా దీదీ నుంచి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నాకు ఎంతో వేదన కలిగింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఓం శాంతి.’’ అని అప్పుడు ట్వీట్ చేశారు.
Also Read: Indira Devi Death :మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత - విషాదంలో కృష్ణ ఫ్యామిలీ