Laptop Delivered in 13 minutes: ఆర్డర్ చేసిన 13 నిమిషాల్లోనే ల్యాప్ టాప్ డెలివరీ చేశారంటూ ఓ సన్నీ ఆర్ గుప్త అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన అనుభవాన్ని ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు. ఇంత పాస్ట్ గా తుపాన్ డెలివరీని తాను ఊహించలేదని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
13 నిమిషాలకే మోగిన కాలింగ్ బెల్
బెంగళూరులో నివాసముంటున్న సన్నీ కొత్త ల్యాప్ టాప్ కోసం అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్(Amazon), ఫ్లిప్ కార్ట్(Flipkart)లో వెతకడం ప్రారంభించాడు. తన రిక్వైర్‌మెంట్‌కు తగిన కాన్పిగరేషన్‌తోపాటు తన బడ్జెట్ ల్యాప్ టాప్ కోసం బ్రౌజ్ చేశాడు. ఇంతలో ఫ్లిప్ కార్ట్‌లో 15 నిమిషాల్లో డెలివరీ ఆఫ్షన్ తనని ఆపేసింది. నిజంగా 15 నిమిషాల్లో డెలివరీ చేయడం సాధ్యమేనా అని నవ్వుకుంటూ చూద్దాం అని అనుకున్నాడు. తాను కోరుకున్న ల్యాప్‌టాప్‌ను అందులో ఆర్డర్ చేశాడు.
పేమెంట్ చేసేసిన 13 నిమిషాల్లో తన ఇంటి కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఫ్లిప్ కార్ట్ నుంచి డెలివరీ బాయ్. టైం చూస్తే అప్పటికీ తాను ల్యాప్ ఆర్డర్ చేసి కేవలం 13 నిమిషాలే అయింది. ఇంత తుపాన్ ఫాస్ట్ డెలివరీకి నమ్మలేక నోరెళ్లబెట్టడం సన్నీ వంతయింది. ఇది నిజమా కలా.. అనుకంటూ అసలు వచ్చింది నిజమైన ల్యాప్ ట్యాపేనా అని డెలివరీ బాయ్ ఇచ్చిన బాక్సును ఓపెన్ చేసి నిర్ధారించుకున్నాడు. తాను ఆర్డర్ పెట్టిన ల్యాప్ టాప్ కేవలం 13 నిమిషాల్లో డెలివరీ కావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇదే విషయాన్ని అతను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
Also Read: ఏం చేయకుండానే అమెజాన్‌లో రూ. 3 కోట్లు జీతం, సోషల్ మీడియాలో రచ్చరచ్చ
సన్నీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై కొందరు మార్కెటింగ్ ట్రిక్కు అని కామెంట్ చేస్తున్నారు. దానికి కూడా సన్నీ సమాధానం ఇస్తూ తాను పర్సనల్ అవసరం కోసమే ల్యాప్ టాప్ కొన్నానని, మీలాగే తాను కూడా నమ్మశక్యంకాక అనుభవాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు.
గిఫ్టుగా ల్యాప్ టాప్ బ్యాగ్
సన్నీ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్లిప్ కార్ట్ టీమ్ అతన్ని సంప్రదించింది. తన అనుభవాన్ని నిజాయితీగా పోస్ట్ చేసినందుకు ల్యాప్ టాప్ బ్యాగును బహుమతిగా అందజేశారు. ఇదే విషయాన్ని కూడా సన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బెంగళూరులో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫ్లిప్ కార్ట్ పాస్టెస్ట్ డెలివరీ సేవలను అందజేస్తోంది. అందులో భాగంగానే సన్నీ ఉంటున్న ప్రాంతానికి కేటాయించిన 15 నిమిషాల కన్నా రెండు నిమిషాల ముందుగానే ల్యాప్ టాప్ డెలివరీ చేశారు నిర్వాహకులు. కొత్తగా ఫ్లిప్ కార్ట్ సంస్థ మినిట్ప్ Flipkart ‘Minutes’ సేల్ అని స్టార్ట్ చేశారు. ఇదిప్పుడు Blinkit, Swiggy Instamart కి పోటీగా తయారైంది.