Land For Job Scam:
బెయిల్ మంజూరు..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో భాగంగా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనతో పాటు రబ్రీదేవి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది కోర్టుకు వచ్చారు. విచారణ తరవాత లాలూ, రబ్రీ దేవి, ఎంపీ మీసా భారతికి కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మార్చి 29వ తేదీన మరోసారి విచారించనున్నట్టు ప్రకటించింది కోర్టు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి కోర్టుకి వచ్చి జడ్డ్ ముందు హాజరయ్యారు. ఆ వెంటనే ఈ ముగ్గురూ బెయిల్ పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు రూ.50 వేల పర్సనల్ బాండ్‌పై బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. బీజేపీ మాత్రం ఈ విషయంలో లాలూపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కొందరు RJD నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసుపై చర్చ జరుగుతోంది. లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేశారని కొందరు వాదిస్తున్నారు. లాలూకి బెయిల్ రావడంపై RJD నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నేతలకు మిఠాయిలు పంచారు. దీనిపై అసహనం వ్యక్తమైంది. ఇరు వర్గాలు లడ్డూలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు.