తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షపై న్యాయ నిపుణుల సలహాలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని కమిషన్ చెబుతోంది. మంగళవారం (మార్చి 14) సాయంత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. సాంకేతిక కారణాలతో సమావేశాన్ని వాయిదా వేసింది. పోలీసుల దర్యాప్తు నివేదిక కోసం కమిషన్ ఎదురుచూస్తోంది.


లీకేజీ వ్యవహారం ఇద్దరు, ముగ్గురి వరకు మాత్రమే పరిమితమైందని వెల్లడైతే ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనే విషయమై ప్రాథమిక చర్చ నిర్వహించింది. పరీక్ష రద్దు చేస్తే అభ్యర్థుల నుంచి ఎదురయ్యే అభ్యంతరాలు, చేయకుంటే వచ్చే వివాదాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)  పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.  


తెలంగాణలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీక టీఎస్‌పీఎస్సీ మొదట నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే భూగర్భజలశాఖ పరిధిలో మరో 4 డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 837కి చేరింది. 


పోస్టుల వివరాలు...


మొత్తం ఖాళీలు: 837


* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 


విభాగాలవారీగా పోస్టుల వివరాలు..

1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు

 విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)


2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.


3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.


4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .


5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .


6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు
విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు
విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 


8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.


9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్


10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు
విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.


* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు


1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.


2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్


3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.


4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు
విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 


5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు
విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.


* డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) : 4 పోస్టులు
విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.


Notification