యూపీలోని లఖింపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు, ట్రక్‌ ఢీకొని...8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శారదా నది బ్రిడ్జ్‌పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం అందగానే...పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి తరలి వచ్చారు. పలువురు ఉన్నతాధికారులూ...ప్రమాదం జరిదిన తీరుని సమీక్షించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. 










Lakhimpur Road Accident: