భాజపాపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రచారం చేస్తోన్న భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాపుర్‌లో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు.
వివాదాల్లో
'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై రాజుకున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చిత్రంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూాడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. 'ద కశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాలు మరిన్ని రావాలని.. వీటి వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని మోదీ ఇటీవల అన్నారు.
ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా అగ్రనేతలు ఈ సినిమాను వెనకేసుకొచ్చారు. ఇలాంటి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.
కశ్మీర్ లోయలో పండిట్లపై జరిగిన దాడులు, వాళ్లని అక్కడి నుంచి తరిమికొట్టిన విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించేందుకు ద కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. 1990లలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.
లఖింపుర్ ఘటన
అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ చిత్రన్నా వెనకేసుకొస్తోన్న భాజపాపై విమర్శలు కురిపించారు. 1990-2007 మధ్య కాలమైన 17 ఏళ్లలో కశ్మీర్ పండిట్ల కంటే ఎక్కువ మంది ముస్లింలను హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా అఖిలేశ్ యాదవ్ కూడా భాజపాను ఇరుకున పెట్టేందుకు 'లఖింపుర్ ఫైల్స్' అని సినిమా తీయాలని పంచ్‌లు వేశారు.
గత ఏడాది అక్టోబర్ 3న కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు అజయ్ మిశ్రా వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో ముగ్గురు మరణించారు.
Also Read: Snake Stunt Goes Wrong : కోబ్రాలతో గేమ్సా ? ఏం జరుగుతుందో సయ్యద్‌కు బాగా తెలుసు