పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. మార్చి 23న షాహిద్ దివస్ రోజు అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నామన్నారు.
అవినీతిపై రాష్ట్ర ప్రజలు వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు. అది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే.. ఆడియో లేదా వీడియో తీసి నాకు పంపండి. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పంజాబ్‌లో ఇక అవినీతి ఆటలు సాగవు. - భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
పంజాబ్ ప్రజల కోసం ఈరోజు ఓ భారీ నిర్ణయం ప్రకటిస్తామని భగవంత్ మాన్ ఉదయం సోషల్ మీడియాలో తెలిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు.
సిద్ధూ ప్రశంసంలు
పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత పీసీసీ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. సీఎం భగవంత్‌మాన్‌పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో భగవంత్ మాన్ ఓ 'కొత్త యాంటీ మాఫియా యుగం' తీసుకువస్తారన్నారు.
ఎవరూ ఊహించని వ్యక్తి, సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. ప్రజల్లో చాలా ఆశలున్నాయి. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడిచే రోజులను మళ్లీ భగవంత్ మాన్ తీసుకొస్తారు. - నవజోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత