హిందీ చలన చిత్ర పరిశ్రమలో విజయవంతమైన కథానాయికల్లో విద్యా బాలన్ ఒకరు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 'ద డర్టీ పిక్చర్', 'కహాని', 'షేర్ని' తదితర ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. అయితే... అటువంటి విద్యా బాలన్‌కు కూడా కెరీర్ ప్రారంభంలో అవమానాలు తప్పలేదు. అప్పట్లో తనను సినిమా నుంచి తొలగించిన నిర్మాతలు, ఇప్పుడు ఫోనులు చేసి సినిమాలు చేయమని అడుగుతున్నారని ఆమె వివరించారు.


"గతంలో నన్ను సినిమా నుంచి తొలగించి వేరే కథానాయికలను తీసుకున్న నిర్మాతలు నాకు ఫోనులు చేస్తున్నారు. సున్నితంగా వాళ్ళ సినిమాలను తిరస్కరిస్తున్నాను. నన్ను 13 సినిమాల నుంచి బయటకు గెంటేశారు. ఓ నిర్మాత ప్రవర్తన అయితే దారుణంగా ఉంది. ఆరు నెలలు నన్ను నేను అద్దంలో చూసుకోలేదు. చూసుకునే ధైర్యం చేయలేదు. అంత నీచంగా ఫీలయ్యేలా చేశారు" అని విద్యా బాలన్ పేర్కొన్నారు.


Also Read: 'జేమ్స్‌' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?


ఒకానొక సమయంలో వరుసగా సినిమాల నుంచి తీసేస్తుంటే... ముంబైలోని మెరీనా డ్రైవ్ నుంచి బాంద్రా వరకూ ఎండలో నడుచుకుంటూ వెళ్లాలని విద్యా బాలన్ తెలిపారు. అప్పట్లో కె. బాలచందర్‌తో రెండు సినిమాలకు సంతకం చేశానని, తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ సినిమాల నుంచి కూడా తొలగించారని ఆమె చెప్పారు. న్యూజీలాండ్‌లో షూటింగ్ అని చెప్పి పాస్‌పోర్ట్ అడ‌గ‌క‌పోవ‌డంతో అనుమానం వచ్చి బాలచందర్ కుమార్తెకు తన తల్లి ఫోన్ చేయగా... విద్యా బాలన్ బదులు వేరే అమ్మాయిని తీసుకున్నట్టు చెప్పారట. 


Also Read: అబ్బాయి బ్రాహ్మిణ్, అమ్మాయి క్రిస్టియన్ - అంటే సుందరానికీ!