IT coaching in Rajasthan Kota has now collapsed:  ఐఐటీలో సీటు కొట్టాలంటే రాజస్థాన్ లోని కోట అనే పట్టణంలో ఉన్న కోచింగ్ సెంటర్లలో.. కోచింగ్ ఇప్పిస్తే చాలనుకునేంతగా అప్పటి ప్రాంతానికి పేరు వచ్చింది.ముఫ్పై ఏళ్ల క్రితమే అక్కడి కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు కష్టపడి ర్యాంకులు తెచ్చుకుంటూ వచ్చారు. టాప్ ర్యాంకులు అన్నీ కోటా కోచింగ్ ఇండస్ట్రీ నుంచి ఉండటంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకు వచ్చి అక్కడి కోచింగ్ సెంటర్లలో తల్లిదండ్రులు చేర్పించేవారు. ఈ హవా అలా కొనసాగుతూ వచ్చింది. 


అయితే అక్కడ కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ ఎక్కువైపోయింది. డిమాండ్ పెరగడంతో ఊరంతా కోచింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి. దీంతో తమకంటే తమకు ఎక్కువ ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో విద్యార్థులపై ఆయా కోచింగ్ సెంటర్ల యజమానులు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. చివరికి ఆ విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. ఇలాంటివి విపరీతంగా పెరిగిపోవడంతో తమ పిల్లలను బలి చేసుకోవడం ఇష్టం లేని వారు చేర్పించడం మానేశారు.క్రమంగా కోటలో కోచిగ్ సెంటర్లు మూతపడటం ప్రారంభమయ్యాయి. రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికి సగం మంది తగ్గిపోవడంతో కోచింగ్ సెంటర్లు కూడా తగ్గిపోయాయి.



Also Read: VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!