SBI Amrit Vrishti Fixed Deposit Scheme Details: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (STATE BANK OF INDIA) ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని (Special FD Scheme) ఇటీవల ప్రారంభించింది. ఇది, ఇతర సాధారణ FDల కంటే మెరుగైన రాబడిని ఇస్తుంది. కొత్త ఎఫ్‌డీ పథకం పేరు "అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్". దీని కాల వ్యవధి 444 రోజులు.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ పరిమిత కాల పథకం. ఇది, 16 జులై 2024న ప్రారంభమైంది & 31 మార్చి 2025 వరకు పెట్టుబడి కోసం అందుబాటులో ఉంటుంది.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ Vs ఎస్‌బీఐ రెగ్యులర్ ఎఫ్‌డీ పథకాలు: ప్రస్తుతం, సాధారణ కస్టమర్‌లు SBI సాధారణ FD పథకాలు లేదా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లలో, వివిధ కాల వ్యవధులను బట్టి, 3.50 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) రెగ్యులర్ సేవింగ్స్ స్కీమ్‌లపై సాధారణ ప్రజల కంటే అదనంగా 0.50 శాతం వడ్డీని పొందుతారు, ఈ రేట్లు ఏడాదికి గరిష్టంగా 7.50 శాతం వరకు ఉన్నాయి.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో సాధారణ కస్టమర్లకు 7.25 శాతం వార్షిక వడ్డీ; సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది.
ఒకవేళ, మీరు ఈ స్కీమ్‌లో రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ లభిస్తుందో ఉదాహరణతో చూద్దాం.
అమృత్ వృష్టి అకౌంట్ ఓపెన్ చేసి రూ. 1 లక్ష FD వేస్తే, 444 రోజులకు (1.2 సంవత్సరాలు)...
సాధారణ కస్టమర్లకు రూ. 1,09 లక్షలు (వడ్డీ రూ. 9,133.54) అందుకుంటారు.
సీనియర్ సిటిజన్లకు రూ. 1,09,787.04 (వడ్డీ రూపంలో రూ. 9,787.04) అందుకుంటారు.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఎంత డిపాజిట్ చేయవచ్చు?
మీ దగ్గర రూ. 1000 ఉన్నా ఈ ఎఫ్‌డీ ప్రారంభించవచ్చు - గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు.
దేశీయ & ఎన్నారై (NRI) ఖాతాదారులు రూ.3 కోట్ల లోపు డిపాజిట్ చేయవచ్చు.
పెట్టుబడిదారుడు నెలవారీ, త్రైమాసికం & అర్ధ వార్షిక పెట్టుబడిగా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలా, వద్దా?
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా, పెట్టుబడిదారులు SBIలోని రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. కాబట్టి, తక్కువ వ్యవధిలో గరిష్ట రాబడిని కోరుకునే వ్యక్తులు ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు.
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి, మీ దగ్గరలోని SBI బ్రాంచ్‌ను సందర్శించవచ్చు. లేదా, YONO SBI లేదా YONO లైట్ మొబైల్ యాప్ ద్వారా ఇల్లు కదలకుండా డిపాజిట్ చేయవచ్చు. SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!