ఫోన్లో మాట్లాడాలి లేదా చాట్ చేయాలి. బోర్ కొడితే వీడియోలు చూసుకోవాలి లేదా గేమ్స్ ఆడుకోవాలి. అంతేగానీ.. అమాంతంగా మింగేస్తారా? ఫోన్‌ను మింగడం ఏమిటీ? మరీ చిత్రం కాకపోతే.. అదేమైనా ఆహారమా అనేగా మీ సందేహం. అయితే, మీరు యూరప్‌లోని కోసోవో రిపబ్లిక్‌కు చెందిన ఈ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. 


33 ఏళ్ల వ్యక్తి.. ఏకంగా నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు. ఆ రోజు నుంచి అతడి కడుపు రింగవుతూనే ఉంది. అవి వైబ్రేట్ అయ్యేటప్పుడల్లా అతడికి కడుపు కదిలిపోతున్నంత నొప్పితో విలవిల్లాడాడు. దాన్ని ఎలాగైనా మూత్ర ద్వారం ద్వారా బయటకు తీయాలని ప్రయత్నించాడు. ఈ సందర్భంగా బకెట్ల కొద్ది నీళ్లు తాగాడు. అయినా సరే ఫలితం లేకపోయింది. అది బయటకు రాకపోగా.. నొప్పి మరింత పెరిగింది. అది అసలే నోకియా ఫోన్. దాన్ని మిక్సీలో వేసినా విరగదు. అలాంటిది కడుపులో ఎలా కరుగుతుంది? ఎట్టకేలకు ఈ విషయాన్ని గ్రహించిన బాధితుడు నొప్పిని భరించలేక వైద్యుడిని ఆశ్రయించాడు. 


బాధితుడికి ఎక్స్‌రే చేసిన వైద్యులు.. కడుపులో మొబైల్ ఫోన్‌ను గుర్తించారు?. దాన్ని వెంటనే బయటకు తీయకపోతే.. అందులోని బ్యాటరీ నుంచి యాసిడ్ లీకై.. కడుపును కల్లోలం చేస్తుందని బాధితుడికి చెప్పారు. కానీ, దాన్ని బయటకు తీసేదెలా.. వెనుక నుంచి తీయాలన్నా ఆ ఫోన్ చాలా పెద్ద సైజులో ఉంది. తొలుత సర్జరీ ద్వారా దాన్ని బయటకు తీయాలని ఆలోచించారు. అయితే, ఆ ఫోన్ కడుపులో మూడు భాగాలుగా విడిపోయి ఉండటంతో ఎండోస్కోపీ విధానంలో చాలా జాగ్రత్తగా దాని బయటకు తీశారు. అయితే, బ్యాటరీ అప్పటికే ఉబ్బిపోయి ఉంది. దాన్ని బయటకు లాగేప్పుడు కలిగే ఒత్తిడికి అది పేలిపోతుందనే భయం వైద్యులను వెంటాడింది. లక్కీగా ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా సర్జరీ విజయవంతమైంది. అయితే, అతడు ఫోన్ ఎందుకు మింగాడు? ఎలా మింగాడనేది మాత్రం తెలియరాలేదు. 



చైనాలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జియాంగ్సు ప్రావీన్స్‌లోని తైజౌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా టూత్ బ్రష్ మింగేశాడు. ఉదయం నిద్రమత్తులో బ్రష్ చేస్తూ.. వెనుక పళ్లను కూడా తోమేందుకు బ్రష్‌ను లోపలికి పెట్టుకున్నానని, ఒక్కసారి అది గొంతులోకి జారడంతో బయటకు లాగేందుకు ప్రయత్నించానని వైద్యులకు తెలిపాడు. కానీ, బ్రష్ ప్లాస్టిక్ బాడీకి గ్రిప్ లేకపోవడం వల్ల చేతి నుంచి జారిపోయిందన్నాడు. బ్రష్ గొంతులోకి వెళ్లిన తర్వాత చాలా అసౌకర్యంగా అనిపించిందని తెలిపాడు. అతడికి చికిత్స అందించిన టైజౌ ఫోర్త్ పీపుల్స్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వాంగ్ జియాన్రాంగ్  మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు వెంటనే హాస్పిటల్‌కు వచ్చి మంచి పనిచేశాడు. లేకపోతే దానివల్ల  అన్నవాహికకు గాయాలయ్యేవి. దాన్ని మింగిన తర్వాత అతడు ఆహారం తీసుకుని ఉంటే బ్రష్‌ కడుపులోకి జారి మరింత క్లిష్టమయ్యేది. ఎక్స్‌రేలో 15 సెంటీమీటర్ల పొడవు బ్రష్ కనిపించిందని, వెంటనే గ్యాస్ట్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా బ్రష్‌ను తొలగించాం. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు’’ అని తెలిపారు. సోషల్ మీడియాలో చర్చనీయమైన ఈ ఘటన గురించి తెలిసి నెటిజనులు.. ‘‘అరె ఏంట్రా ఇదీ’’ అని ఆశ్చర్యపోతున్నారు. 


Also Read: చీకటి గదిలో 25 ఏళ్లు బందీ.. కూతురికి నరకం చూపిన తల్లి, శరీరం కుళ్లుతున్నా..


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?


Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్


Also Read: ఈ గ్రామంలో స్త్రీ, పురుషులకు వేర్వేరు భాషలు.. మరి ఇద్దరు కలిస్తే? వీరు దేవుడు చేసిన మనుషులట!