Kharge has written to Prime Minister Modi : భారత రాజకీయాల్లో విలువలు కాపాడాలని గీత దాటి రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన బీజేపీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే .. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.  ఇటీవల రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడిన మాటలు దేశద్రోహం అంటూ. . కొంత మంది బీజేపీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రాహుల్ గాంధీని టెర్రరిస్టుతో పోల్చారు. ఈ విమర్శలు దుమారం రేపాయి. 


లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహల్ గాంధీపై ఇలాంటి అనాగరికంగా మాట్లాడటం మంచిది కాదని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రితో పాటు యూపీకి చెందిన ఓ మంత్రి కూడా రాహుల్ ను టెర్రరిస్టుగా సంబోధించారన్నారు. ఇలా మాట్లాడే వారందర్న కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం  చేశారు. ఒకరు ఇందిరాగాంధీ లాగానే రాహల్ గాంధీకి కూడా మరణం వస్తుందని హెచ్చరించారని ఇలాంటివన్ని ఇతురుల్ని మోటివేట్ చేసేలా ఉంటాయన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారిపై ప్రధాని మోదీ తక్షణం ఆంక్షలు విధించాలని ఆశిస్తున్నానన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే నేతల్ని బీజేపీ నుంచి  బహిష్కరించాలని కోరారు. 


ఫెడెక్స్ కాదు ఇప్పుడు ఇండియా పోస్ట్‌ను కూడా వాడేస్తున్నారు - సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి !


ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పాటు వీడియో కూడా మల్లిఖార్జున్ ఖర్గే రిలీజ్ చేశారు.  



 

ఇటీవలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిక్కులు తలపాగాలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారని.. ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ విదేశాల్లో భారత్ పరువును తీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆగ్రహిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ తీవ్రంగా ఉండటంతో మల్లిఖార్జున్ ఖర్గే నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేశారు. 


హఠాత్తుగా ఆగిపోయిన జియో సిగ్నల్స్‌ - దేశవ్యాప్తంగా గగ్గోలు


రాహుల్ గాంధీ గత విదేశీ పర్యటనల సమయంలోనూ అక్కడ చేసే వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. దశాన్ని కించ పరిచేలా వ్యవహరిస్తున్నారని చాలా సార్లు ఆరోపించారు. గతంలో పార్లమెంట్ సమావేశాల్ని కూడా అడ్డుకున్నారు. ఈ సారి అమెరికా టూర్‌లోనూ అదే పరిస్థితి కనిపించింది.