Cybercriminals are now using India Post for online fraud :  సైబర్ మోసాల వల్ల ఇప్పుడు ఎక్కువగా నష్టపోతోంది ఏమీతెలియని వాళ్లు కాదు. అన్నీ తెలిసిన వాళ్లే. వాళ్లనే అతి తెలివిగా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఫలానా పార్శిల్ వచ్చిందని.. అందులో డ్రగ్స్ ఉన్నాయని ఓ సారి.. మీ బ్యాంక్ అకౌంట్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని మరోసారి ఫోన్లు  చేస్తూంటారు. ఇలాంటి వారి బారిన పడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు మరింతగా రాటుదేలిపోయారు ఈ ఆన్ లైన్ ఫ్రాడ్‌స్టర్లు. నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా పోస్టు ను కూడా వాడేసి మోసం చేస్తున్నారు. 


ఇండియా పోస్టు పేరుతో కాల్ చేసి డ్రగ్స్ వచ్చాయని బెదిరింపులు            


హైదరాబాద్ లోని మారేడు పల్లికి చెందిన ఓ వ్యక్తికి ఇండియాపోస్టు నుంచి ఫోన్ వచ్చింది. నిజానికి అది  ఇండియా పోస్టు నుంచి వచ్చంది కాదు.. మోసగాళ్ల నుంచి వచ్చింది. ఇండియా పోస్టు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ పేరుతో వచ్చిన ఓ పార్శిల్లో నిషేధ వస్తువులు వచ్చాయని కస్టమ్స్‌కు కాల్ కనెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈ రోజుల్లోఆన్ లైన్ లోప్రతి ఒక్కరూ ఏదో ఒకటి బుక్ చేస్తూనే ఉంటారు కాబట్టి.. అలా బుక్ చేసిన దాంట్లో ఏదో  తేడా వచ్చిందేమో అని ఆ వ్యక్తి కంగారు పడ్డారు.  ఆ కంగారును ఆసరా చేసుకుని .. కేసులని.. డిజిటల్ అరెస్టులని బెదిరించి కనీసం పాతిక లక్షల రూపాయల నుంచి అకౌంట్ నుంచి లాగేశారు మోసగాళ్లు. 


దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు


ఖాతాల్లో ఉన్నడబ్బులన్నింటిని ఖాళీ చేస్తున్న నేరగాళ్లు          


డబ్బులన్నీ పోయిన తర్వాతనే అసలు వ్యక్తికి విషయం తెలిసి పోలీసుల్ని ఆశ్రయించారు. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ప్రచారం  నిర్వహిస్తున్నారు. అపరిచత వ్యక్తులు చేసే ఫోన్లను అటెండ్ చేయవద్దని అంటున్నారు. ఒక వేళ మాట్లాడితే.. కొరియర్ సర్వీస్ పేరుతో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే అసలు నమ్మవద్దని కోరుతున్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 


Also Read: Balapur Ganesh Laddu Auction 2024: వేలంలో లక్షలు వెచ్చించి కొన్న గణేషుడి లడ్డూని ఏం చేస్తారు - దానివల్ల ఏం ఉపయోగం!


విదేశాల నుంచి మోసాలు చేసి.. క్రిప్టో ద్వారా డబ్బులు తరించే స్తున్న మోసగాళ్లు                   


బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసిన వారు కూడా మోసపోతున్నారు. వారిని డిజిటల్ అరెస్టులని మోసగాళ్లు భయపెడుతూండటమే కారణం. ఇలాంటి ముఠాల్ని ఎన్ని అరెస్టు చేసినా కొత్తగా పుట్టుకు వస్తున్నాయి. దోచుకున్న సొమ్మును ఎప్పటికప్పుడు క్రిప్టోలోకి మార్చేసుకుంటూ దేశం దాటిస్తున్నారు.