Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు

Nalgonda News: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఓ దొంగను పట్టుకున్న స్థానిక యువకులు దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేశారు. అనంతరం తనకు ఆకలి వేస్తుందని దొంగ చెప్పగా అతనికి పులిహోర తినిపించారు.

Continues below advertisement

Youth Attacked On Thief And Fed Food In Nalgonda: ఓ దొంగ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతుండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం తనకు ఆకలి వేస్తుందని సదరు దొంగ చెప్పగా పులిహోర తినిపించి అతని ఆకలి తీర్చారు. నల్గొండ జిల్లాలో (Nalgonda District) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌‍గా మారాయి. స్థానిక యువకులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో పోగల గణేష్ అనే వ్యక్తి ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. తరచూ చోరీలు జరుగుతుండడంతో మాటు వేసిన స్థానిక యువత సోమవారం రాత్రి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేశారు. ఈ క్రమంలో తనకు ఆకలి వేస్తుందని దొంగ చెప్పగా.. ఓ యువకుడు అతనికి పులిహోర తినిపించాడు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. కాగా, దొంగకు పులిహోర తినిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Continues below advertisement

Also Read: Balapur Ganesh Laddu Auction 2024: వేలంలో లక్షలు వెచ్చించి కొన్న గణేషుడి లడ్డూని ఏం చేస్తారు - దానివల్ల ఏం ఉపయోగం!

Continues below advertisement