Kerala: ఈ మధ్య ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్డుపై నడిచి వెళ్లాలంటేనే భయమేస్తుంది. తాజాగా కేరళలో ఓ ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కులు చేజ్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కుక్కలు వెంటాడినట్లు లేదు వేటాడటానికి వస్తున్నట్లు ఉంది.
సేఫ్‌గా
కన్నూర్ పట్టణంలో వీధి కుక్కల గుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడాయి. ఆ విద్యార్థులు రోడ్డుపై నడిచి వస్తుండగా వీధిలో ఉన్న కుక్కల గుంపు మొరుగుతూ విద్యార్థులపైకి వచ్చాయి. ఒకేసారి ఆరు కుక్కలు మీదకి రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
తప్పించుకునేందుకు కుర్రాళ్లు పరుగు పెట్టడంతో కుక్కలు మరింత వేగంగా ఛేజింగ్ చేశాయి. అయితే అదృష్టవశాత్తు విద్యార్థులు పరుగులు తీసి వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి లోపలకు వెళ్లి గేటు వేశారు.
దీంతో రెప్పపాటు కాలంలో కుక్కల దాడి నుంచి ఇద్దరు విద్యార్థులు తప్పించుకున్నారు. విద్యార్థులు గేటు లోపల ఉండటంతో బయట కుక్కలు మొరుగుతూ అక్కడే పాగా వేశాయి. దీంతో విద్యార్థులు ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.
మరో ఛేజ్
రోడ్డుపైనే బైఠాయించిన వీధి కుక్కలు మరో మహిళ ఇంటికి వెళుతుండగా ఆమె వెంట కూడా పడ్డాయి. ఆమె కూడా పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధి కుక్కులతో జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరో ఘటన
పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ బాలుడిని అతడుండే సొసైటీకి చెందిన ఓ కుక్క కరిచిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగింది. అయితే, బాలుడు బాధతో విలవిల్లాడుతున్నా ఎలాంటి జాలి లేని ఆ శునకం యజమాని అలాగే చూస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ మహిళా యజమాని ప్రవర్తన పట్ల నెటిజన్లు ఫైర్ అయ్యారు.
బాలుడు సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నాడు. పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి ఎక్కగా ఆ తర్వాత ఓ మహిళ తన పెంపుడు శునకంతో ఆ లిఫ్ట్‌లో ఎక్కింది. అయితే, లిఫ్ట్ ఎక్కిన కొద్దిసేపటికే ఆ బాలుడిని కుక్క కరిచింది. దీంతో ఆ బాలుడు తన కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిల్చొంది.
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జేబు దొంగల హల్‌చల్- పోలీసులకు కొత్త కష్టాలు!
Also Read: Ajit Pawar: 'వాష్‌రూమ్‌కు వెళ్తే వార్తలు రాసేశారు! పార్టీపై నాకేం కోపం లేదు'