ED Charges Against Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది. పది రోజుల పాటు కస్టడీ కావాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని తేల్చి చెప్పింది. ఈ పాలసీ రూపకల్పనలోనూ ఆయన భాగస్వామ్యం ఉందని కోర్టుకి వెల్లడించింది. దీంతో పాటు 5 కీలక అభియోగాలు మోపింది.
1. లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి
2. ఈ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ భాగస్వామ్య ఉంది.
3. ఈ స్కామ్‌లో వచ్చి నిధుల్ని గోవా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించారు.
4. కొంత మందికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. వాళ్ల నుంచి పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారు.
5. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉన్న సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారు.
తమ వద్ద అన్ని ఆధారులన్నాయని ఈడీ కోర్టుకి వెల్లడించింది. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్ పాత్రపై కవిత నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. మొత్తంగా 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ని సమర్పించింది. హవాలా ద్వారా రూ.45 కోట్లు గోవాకి పంపినట్టు ఆరోపించింది. మొత్తం నాలుగు మార్గాల ద్వారా ఈ డబ్బుని పంపినట్టు కోర్టుకి వివరించింది. ఆప్,సౌత్ గ్రూప్ మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నట్టు తెలిపింది.