Karnataka Election Results 2023:
1985 నుంచి ఇంతే..
కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయంలో ఒపీనియన్ పోల్స్,ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతోంది. కాంగ్రెస్ సెంచరీని దాటడమే కాదు...మేజిక్ ఫిగర్‌ని మించి లీడ్‌లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎలక్షన్ ఫైట్‌లో చివరికి కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హంగ్ వస్తుందని కొందరు ఊహించినప్పటికీ...వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే కర్ణాటక ఎన్నికలు ఎప్పుడూ ఇలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. కన్నడ ఓటర్ల మనసు గెలుచుకోవడం అంత సులభం కాదు. ఈవీఎమ్ దగ్గర మీట నొక్కేంత వరకూ వాళ్ల మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఓ సారి ఓ పార్టీకి అధికారం కట్టబెట్టారంటే..మరోసారి అదే ప్రభుత్వానికి అవకాశమివ్వరు. ఇది ఇప్పుడు కాదు. 1985 నుంచి వస్తున్న ట్రెండ్. అప్పటి నుంచి 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ 7 సార్లు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదు. మరోసారి అవకాశం ఇద్దాం అని జాలి చూపించరు. నచ్చకపోతే సింపుల్‌గా మరో పార్టీకి ఓటువేసేస్తారు. ఈ సారి కూడా అదే ట్రెండ్ కొనసాగనున్నట్టు స్పష్టమవుతోంది.
ఆ రెండు కమ్యూనిటీల చుట్టూ..
మరోసారి ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బీజేపీ సౌత్ మిషన్‌పై నీళ్లు చల్లుతూ ట్రెండ్ కొనసాగించారు కన్నడ ఓటర్లు. అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కి ఓటు వేశారు. జేడీఎస్‌కి కూడా చెప్పుకునే స్థాయిలో సీట్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌కి మేజిక్ ఫిగర్ రాకపోతే...అప్పుడు మళ్లీ జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుంది. కాంగ్రెస్‌కి రాష్ట్రవ్యాప్తంగా ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ విషయానికొస్తే మాత్రం కేవలం నార్త్, సెంట్రల్ జిల్లాల్లోనే లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న చోట బలం ఉంది. జేడీఎస్‌కి ఓల్డ్ మైసూర్ లాంటి సౌత్ కర్ణాటకలో ఎక్కువ క్యాడర్ ఉంది. ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో విధమైన ఓటు బ్యాంకు ఉండటం వల్ల ఇక్కడి ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.
Also Read: Karnataka Election Results 2023: హంగ్ లేనట్టే! క్లారిటీతో ఉన్న కర్ణాటక ఓటర్లు