పప్పు నుంచి బిర్యానీ వరకు వెల్లుల్లి లేకుండా ఏ వంటకం పూర్తవదు. కాస్త ఘాటైన వాసన, రుచి కలిగి ఉండే వెల్లుల్లి భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా ఉంటుంది. వంటలకు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాస్, మెరినేడ్, సూప్, కాల్చి వండే మాంసాహారంలో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అల్లిసిన్ సమ్మేళనం ఇందులో సమ్మేళనం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సమయానికి ఇంట్లో వెల్లుల్లి లేదనుకోండి వాటికి బదులుగా మీరు మరికొన్ని పదార్థాలు ఎంచుకోవచ్చు. ఇవి కూడా వెల్లుల్లి రుచినే వంటకి ఇస్తాయి. ఒక వేళ వెల్లుల్లి అలర్జీ మీకు ఉంటే ప్రత్యామ్నాయంగా వేరేవి ఉపయోగించవచ్చు. అవి వంటకు అద్భుతమైన రుచిని అందిస్తాయి.


చివ్స్


చివ్స్ వెల్లుల్లికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి వాడే ఘాటు రుచి లేకపోయినా వంటలకు తాజా సువాసన ఇస్తుంది. ఎన్నో ఏళ్లుగా చివ్స్ వంటల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. తేలికపాటి ఉల్లిపాయ రుచిగా ఉంటుంది. వాటిని సన్నగా తరిగి వంట ప్రక్రియ ముగిసే టైమ్ లో వేసుకోవచ్చు. కానీ ఇది దీని రుచి వెల్లుల్లి వలె ఘాటుగా ఉండదని మరచిపోవద్దు. ఒకవేళ మీకు అలాంటి రుచి కావాలనుకుంటే మాత్రం పెద్ద మొత్తంలో వేసుకోండి.. వెల్లుల్లి అందుబాటులో లేనప్పుడు చివ్స్ చక్కగా పనికొస్తాయి.


ఆసుఫోటిడా


తెలుగులో చెప్పాలంటే ఇంగువ. దీన్నే హింగ్ అని కూడా పిలుస్తారు. వెల్లుల్లి రుచి కావాలనుకున్నప్పుడు దీన్ని వేసుకోవచ్చు. రుచి, వాసన కూడా కాస్త ఘాటుగానే ఉంటుంది. భారతీయ, మధ్యప్రాచ్య వంటకాలలో రుచి కోసం దీన్ని విరివిగా ఉపయోగించారు. ఇది పొడి రూపంలో లభిస్తుంది. కూరలో చిన్న చిటికెడు లేదా ¼ టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకుంటే చాలు. దీని వాసన ఎక్కువగా ఉంటుంది. అందుకే కొద్ది మొత్తంలో మాత్రమే వేసుకోవాలి. వేడి నూనె లేదా నెయ్యిలో వేసుకుని వేయించుకుంటే ఇంగువ రుచి వంటకు పడుతుంది. వెల్లుల్లి లేనప్పుడు ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.


వెల్లుల్లి పొడి


వెల్లుల్లి పొడి తాజా వెల్లుల్లికి అనుకూలమైన, సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయం. దీని సువాసన తాజా వెల్లుల్లిని పోలి ఉంటుంది. కూరల్లో 1/8 టీ స్పూన్ పొడి జోడించుకుంటే సరిపోతుంది. అయితే వెల్లుల్లి కంటే దాని పొడి మరింత ఘాటుగా ఉంటుంది. అందుకే తక్కువ మొత్తంలో వేసుకోవాలి. రుచిని బట్టి అదనంగా జోడించుకోవచ్చు. వెల్లుల్లి పొడి సూప్, స్టూ, మెరినేడ్, డ్రై రబ్ సహా అనేక వంటలలో ఉపయోగించుకుంటారు.


కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం వెల్లుల్లిలో థియో సల్ఫినైట్ రసాయనాలు ఉన్నాయి. వెల్లుల్లి తొక్క తీసి కట్ చేసేటప్పుడు అది అల్లిసిన్ గా మారిపోతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఊబకాయం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందా?