ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల ప్రధాన పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష ఏప్రిల్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష సమాధానాల ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ సైతం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు. విద్యార్థుల మార్కుల జాబితాతో పాటు.. రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.


ఏపీ రెవెన్యూ విభాగంలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 31న ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో మొత్తం 1494 మంది అభ్యర్థులు బుక్‌లెట్ సిరీస్ సరిగా వేయకపోవడం, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించడం లాంటి కారణాల వల్ల అనర్హతకు గురయ్యారు.  స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 



జిల్లాలవారీగా గ్రూప్-4 (నోటిఫికేషన్ 23/2021) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు ఇలా..




ఫైనల్ ఆన్సర్ కీ ఇలా.. 



Also Read: 


ఎన్‌టీపీసీలో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టులు - అర్హతలివే!
 న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు నియామక పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.
అడ్మిట్ కార్డులు, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..