Israel-Hamas Ceasefire : దాదాపు 15 నెలల యుద్దం తర్వాత కాల్పుల విరమణ, బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయని ఓ పక్క సంబరాలు చేసుకుంటుండగా.. మరో పక్క ఇజ్రాయెల్ గాజాపై మరోసారి దాడులకు పాల్పడింది. జనవరి 15న ఇరువురి మధ్య జరిగిన ఒప్పందం జనవరి 19న అంటే ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థాని చెప్పారు. అంతలోనే ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని, కొన్ని భవనాలు సైతం కుప్పకూలాయని సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ - హమాస్ వార్
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించిన హమాస్ దాదాపు 12 వందల ఇజ్రాయెల్ పౌరులను హతమార్చింది. 250 మందిని తమ బందీలుగా చేసుకుని ఆసియాలో యుద్దానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో హమాస్‌కు హెజ్‌బొల్లా, హౌతీ ఉగ్రవాదులు మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు సహకరించాయి. దీంతో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య క్షపణి దాడులు జరిగి 46 మందిని పాలస్తీనియన్ల మరణానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా కాల్పుల విరమణపై ఈజిప్టు, ఖతార్‌లు చర్చలు జరుపుతూ వస్తున్నాయి. ఇందకు అమెరికా ముందు నుంచి మద్దతు తెలుపుతుండగా.. ప్రస్తుతం జరిగిన ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఈ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య దాదాపు 15 నెలలుగా యుద్దం జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు గత కొంతకాలంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగా అవి జనవరి 15, 2025న సఫలీకృతమయ్యాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పింది. అంతేకాకుండా తమ బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడం ఈ కథకు ముగింపు పలికేలా చేసింది. ఈ ఒప్పందం వల్ల 15 నెలలపాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారు ఈ ఒప్పందంతో విడుదల కానున్నారు. తొలుత ఆరు వారాలపాటు కుదిరిన ఒప్పందం ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుంది.
మూడు దశల్లో కుదిరిన ఒప్పందం
తొలి దశలో (మొదటి ఆరు వారాలు) కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి ముందు ఇరు వర్గాలు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ ప్రధానమంత్రి కోరారు. పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తారని అన్నారు. రెండో దశ చర్చల్లో భాగంగా మిగతా బందీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ, ప్రశాంతత పునరుద్దరణ గురించి మాట్లాడతారు. ఈ చర్చలు జనవరి 16 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక మూడో దశలో భాగంగా గాజా పునర్నిర్మాణం, మిగిలిన బందీల శరీరాల అప్పగింతపై చర్చిస్తారు. 2,3 దశలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్ధంగా ఉందని షేక్ మొహమ్మద్ చెప్పారు. ఇకపోతే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయంపై ముందుగా డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్, ఖతార్ ప్రకటన చేశాయి. దీనికి సంబంధించిన ప్రణాళిక 8 నెలల క్రితమే ఖరారైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
Also Read : SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్