Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 3750 కిలోమీటర్లు పూర్తి చేసుకొని దిల్లీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ యాత్ర కొద్ది రోజులు ఆపి మళ్లీ 2023 జనవరి నెలలో పునఃప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. మహాత్మా గాంధీ, ఇతర మాజీ ప్రధాన మంత్రుల స్మారకాలను సందర్శించి నివాళులర్పించారు. అయితే వణికించే దిల్లీ చలిలో అయన టీ షర్ట్, ప్యాంట్ మాత్రమే వేసుకొని కనిపించారు. దిల్లీ చలిలో ఎలాంటి స్వెటర్ లేకుండా ఆయన సాధారణ దుస్తుల్లో రావడం.. నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
చలిలో
సోమవారము ఉదయం దిల్లీలో 6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆ చలిలో రాహుల్ గాంధీ.. రాజ్ ఘాట్, విజయ్ ఘాట్, శక్తి స్థల్, వీర్ భూమి, సదైవ్ అటల్ వంటి భారత మాజీ ప్రధానమంత్రుల స్మారకాలను సందర్శించి.. నివాళులు అర్పించారు. ఈ సందర్శనలో రాహుల్ కేవలం టీ షర్ట్, ప్యాంట్ వేసుకొని, చెప్పులు కూడా లేకుండా చలిలో మహా నాయకులకు నివాళులు అర్పించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
క్రిష్ 10 అనే ట్విట్టర్ యూజర్ "రాహుల్ ను ప్రధాని చేసేయండి, ఇంత చలిలో కూడా ఆయన టీ షర్ట్ వేసుకొని పర్యటిస్తున్నారు"అని కామెంట్ చేశాడు.
రాహుల్ గాంధీ, అమిత్ షా ఫోటోలు పక్కపక్కన పెట్టి మరో వ్యక్తి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ ఫోటోల్లో రాహుల్ కేవలం టీ షర్ట్, ప్యాంట్ వేసుకుని ఉండగా.. అమిత్ షా దుప్పటి కప్పుకుని ఉన్నట్టు వుంది. ఆ పోస్టు కింద "ఇద్దరి వయసుల మధ్య అంత వ్యత్యాసం ఏమీ లేదు"అని రాశారు.
లక్ష్మణ్ కర్కల్ అనే వినియోగదారుడు.. రాహుల్ గాంధీ అంత చలిని తట్టుకోవడానికి సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించారు."చలిని తట్టుకోవడానికి రాహుల్ సీక్రెట్ ఎంటి? ఆయన శారీరక దృఢత్వానికి రహస్యం ఏంటి?... ఉత్తర భారతదేశంలోని చలిని కేవలం టీ షర్ట్ వేసుకొని తట్టుకొని పర్యటిస్తున్నారు.
రాహుల్ సమాధానం
ఇంత చలిలో మీరు ఎందుకు చలి దుస్తులు ధరించలేదని రాహుల్ గాంధీని మీడియా కూడా ప్రశ్నించింది, దీనికి రాహుల్ తనదైశ శైలిలో సమాధానమిచ్చారు.
Also Read: Leopard Attack: వామ్మో చిరుత పులి- 24 గంటల్లో 13 మందిపై దాడి!