Punjab Speaker In TS Assembly :    తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్‌ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వాన్‌ మంగళవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వాహణ అత్యుత్తమంగా ఉన్నది. ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. శాసనసభ సమావేశాల నిర్వాహణ పద్దతులపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పంజాబ్ బృందానికి వివరించిన స్పీకర్ పోచారం  , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రం   అద్భుతాలు చేస్తున్నదని దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్  ప్రశంసించారు.


పంజాబ్ స్పీకర్ కు సన్మానం చేసిన పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి 


శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న కుల్తార్‌ సింగ్‌కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ నిర్వహణ, పనితీరుని కుల్తార్‌ సింగ్‌కు వివరించారు.  తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుఫున కుల్తార్‌ సింగ్‌ని శాలువాతో సత్కరించారు. కుల్తార్‌ సింగ్‌తోపాటు ఆ రాష్ట్ర శాసనసభ్యుడు కల్వంత్ సింగ్ పండోరి, మాజీ శాసనసభ్యుడు అమర్ జీత్ సింగ్ ఉన్నారు.  అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరపున పంజాబ్ స్పీకర్‌ను శాలువాతో సత్కరించి.. మెమెంటోను పోచారం, గుత్తా బహూకరించారు.


నాలుగు రోజులుగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన పంజాబ్ స్పీకర్ 


పంజాప్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వాన్ గత నాలుగు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో అమలు అవుతున్న వివిధ పథకాలు, అభివృద్ధి పనులను పరిశీలంచేందుకు  పంజాబ్ స్పీకర్ సాంద్వాన్ బృందం నిజామాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో  నిజామాబాద్ లో పర్యటించారు. నూతన కలెక్టరేట్, ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.  అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్  కాలేజీ రోజుల్లో తన సన్నిహితుడైనందున నిజామాబాద్ కు వచ్చామని పంజాబ్ స్పీకర్ సాంద్వాన్ తెలిపారు. నిజామాబాద్ నగరానికి గతంలో చాలాసార్లు వచ్చానని కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. 


కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ కలిసి పని చేయాలని స్పీకర్ అభిలాష


కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ లాగా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉంటే భారతదేశం విశ్వ గురువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయ అందించే పథకం చాలా గొప్పదని, అదేవిధంగా ఉచిత కరెంటు ఇంటింటికి తాగునీరు పథకాలు ఆదర్శనీయమన్నారు, పేదింటి ఇక ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం తనని ఎంతో ఆకర్షించిందని తెలిపారు. తెలంగాణలో పర్యటించడం తమ బృందానికి సంతోషకరంగా ఉందని అన్నారు. తాజాగా స్పీకర్ తెలంగాణ  అసెంబ్లీని పర్యటించి.. ప్రభుత్వాన్ని ప్రశంసించారు.