Leopard Attack: అసోంలో చిరుత పులి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జోర్హాట్ జిల్లాలో సోమవారం చిరుత పులి దాడిలో కనీసం 13 మంది గాయపడినట్లు ఏఎన్ఐ తెలిపింది.
అటవీ అధికారుల నుంచి తప్పించుకున్న చిరుత పులి.. జోర్హాట్ ప్రాంతంలో మహిళలు, పిల్లలతో సహా రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RFRI) నివాసితులపై దాడి చేసింది. చిరుత పులికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరుత పులి.. భవనం కంచెపై నుంచి దూకి అటుగా వెళ్తున్న ఓ వాహనంపై దాడి చేసింది.
చిరుత దాడిలో గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చిరుతను గాలిస్తున్నాం. అటవీశాఖ అధికారులు అదే పనిలో ఉన్నారు. - పోలీసు సూపరింటెండెంట్
మా బృందం ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు.. చిరుత పులి మా ఇద్దరు సిబ్బందిపై దాడి చేసింది. మా రెండవ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. చిరుతను పట్టుకునేందుకు మొత్తం మూడు బృందాలు ఇక్కడకు చేరుకున్నాయి. - అటవీ అధికారి
Also Read: Maharashtra Karnataka Border: కర్ణాటకతో సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం