Facts About Italy PM Georgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రులు. కలుసుకున్న ప్రతిసారీ ఇద్దరూ చాలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. G7 సదస్సులోనూ వాళ్లిద్దరి సెల్ఫీ సోషల్ మీడియాలో (Modi Meloni) సెన్సేషన్‌ అవుతోంది. అన్నింటి కన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే...G7 సమ్మిట్‌కి వచ్చిన అతిథులకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే పెట్టారు మెలోని. ఈ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. మోదీ నేర్పిన సంస్కారం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #Melodi హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. అంతే కాదు. మెలోని గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. 


ఆసక్తికర విషయాలివే..


2022 అక్టోబర్‌లో తొలిసారి ఇటలీకి ప్రధానిగా ఎన్నికయ్యారు జార్జియా మెలోని. Brothers of Italy అనే రైట్‌ వింగ్ పార్టీని ఆమె ముందుండి నడిపించారు. అంతకు ముందు ఈ పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మెలోనీ పగ్గాలు చేపట్టాక ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నికల్లో విజయం సాధించింది. చిన్న వయసులోనే పొలిటికల్ జర్నీ మొదలు పెట్టారు జార్జియా మెలోని. మెలోని పుట్టిన తరవాత తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లి సంరక్షణలోనే ఉన్నారు. సొంత కాళ్లపై నిలబడాలన్న పట్టుదలతో బేబీ సిట్టర్‌గా, బార్‌టెండర్‌గా పని చేశారు. ఆ వచ్చిన డబ్బుతోనే చదువుకున్నారు. 15 ఏళ్లకే Italian Social Movement కి చెందిన యూత్ ఫ్రంట్‌లో చేరారు. అందులో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఒక్కో మెట్టు ఎక్కారు. 2008-11 వరకూ మంత్రిగానూ పని చేశారు. 



(Image Credits: Getty)


వలసలపై ఆంక్షలు..


2022లో ప్రధాని అయిన తరవాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వలసలను ఆపేందుకు ప్రత్యేక పాలసీ ప్రవేశపెట్టారు. సరిహద్దు నుంచి ఎవరూ అక్రమంగా దేశంలోకి చొరబడకుండా నిఘా పెట్టేలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటలీలో బర్త్ రేట్‌ పెరగాలనీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవసరమైతే ఆయా కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తామనీ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను ఓ గాడిన పెట్టడం, పన్నులు తగ్గించడం లాంటి చర్యలు ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్రతిపక్షాల అనవసరపు ఆరోపణలు, విమర్శల్ని చాలా తేలిగ్గా కొట్టి పారేస్తారు మెలోని. అంతే కాదు. ఐరోపా సమాఖ్యలోని విధానాలనూ విమర్శించారు. మెలోనీ హయాంలో ఇతర రైట్‌ వింగ్‌ దేశాలతో ఇటలీకి మైత్రి బలపడింది. ముఖ్యంగా యూరప్, హంగేరి, పోలాండ్ దేశాలతో బంధాన్ని బలపరుచుకుంది. NATOలో ఇటలీ ప్రాధాన్యతనీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు మెలోని. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా, ఎక్కడ ఏ సభ జరిగినా "I am Giorgia, I am a woman" అని చాలా గట్టిగా నినదిస్తారు. అదే ఆమెకి ప్రత్యేకతని తెచ్చి పెట్టింది. కుటుంబ విలువల పట్ల ఆమెకి ఎంతో గౌరవం. అందుకే..పిల్లల్ని కనండి, వాళ్లకు విలువలు నేర్పించండి, ప్రభుత్వం సాయం చేస్తుందని చెబుతారు మెలోని. 


Also Read: G7 Summit: స్మైల్ ప్లీజ్, G7 సమ్మిట్‌లో మెలోని మోదీ స్పెషల్ సెల్ఫీ - ఫొటో వైరల్